AP Court Jobs 2022: ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
AP High Court Jobs 2022: ఏపీ హైకోర్టు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
AP High Court Jobs 2022: నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని జిల్లాకోర్టులతోపాటు హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి ఏపీ హైకోర్టు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా కోర్టుల్లో 3,432, హైకోర్టులో 241 పోస్టుల కలిపి మొత్తం 3,673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఖాళీల సంఖ్య, అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలను హైకోర్టు వెబ్‌సైట్ hc.ap.nic.in లో పొందుపరిచారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయడంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ప్రత్యేకంగా చొరవ చూపారు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ వివరాలు:
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.10.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.
వయసు: 01/07/2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయసు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు: మిగతా అభ్యర్థులందరూ:800/-, SC/ST/ మహిళా అభ్యర్థులకు :400/-
విద్యార్హతలు: పోస్టులను బట్టి ఏడోతరగతి, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, టైప్‌రైటింగ్/ స్టెనో సర్టిఫికెట్, కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా
జిల్లా కోర్టుల్లో...
పోస్టుల మెుత్తం- 3,432... ఇందులో
స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-3)- 114
జూనియర్ అసిస్టెంట్- 681
టైపిస్ట్- 170
ఫీల్ట్ అసిస్టెంట్- 158
ఎగ్జామినర్- 112
కాపీయిస్టు- 209
డ్రైవర్ (ఎల్వీ)- 20
రికార్టు అసిస్టెంట్- 9
ప్రాసెస్ సర్వర్- 439
ఆఫీసు సబార్డినేట్- 1520
హైకోర్టులో..
పోస్టులు మెుత్తం- 241
సెక్షన్ ఆఫీసర్/కోర్టు ఆఫీసర్-9
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-13
కంప్యూటర్ ఆపరేటర్స్- 11
ఓవర్సీర్-1
అసిస్టెంట్- 14
ఎగ్జామినర్-13
టైపిస్ట్-16
కాపీయిస్టు- 20
అసిస్టెంట్ ఓవర్ సీర్-1
డ్రైవర్లు-8
ఆఫీసు సబార్డినేట్లు- 135
Also read: Cyclone Sitrang: ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. బంగ్లాదేశ్ దిశగా దూసుకుపోతున్న సిత్రాంగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook