రాజధాని ( Capital issue ) కారణంగా రైతులు రోడ్డున పడటానికి కారణం చంద్రబాబేనని ( Chandrababu ) సీపీఎం నేత రాఘవులు ధ్వజమెత్తారు. రాజధాని పేరుతో రియల్ వ్యాపారమే చేశారని ఆరోపించారు. విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నవంబర్ 7 అంటే ఇవాళ్టి నుంచి 15వ తేదీ వరకూ సీపీఎం పార్టీ ( CPM Party ) రాజకీయ క్యాంపెయిన్ తలపెట్టింది. విజయవాడ ( Vijayawada )లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని సీపీఎం నేత రాఘవులు ( Cpm Raghavulu ) ప్రారంభించారు. అమరావతి రాజధాని వ్యవహారం ( Amaravati capital issue ), రైతుల ఆందోళనపై ఆయన స్పందించారు. రాజధానికి 55 వేల ఎకరాలు అవసరం లేదని..15 వేల ఎకరాలు చాలని ఆనాడే చెప్పామన్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. నాడు ఇదే విషయాన్ని తాము చెప్పినా చంద్రబాబు వినలేదని విమర్శించారు. ఇప్పుడు రైతులు రోడ్డున పడటానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. అటు రాజధాని నిర్మాణం పూర్తి కాకపోవడానికి కూడా చంద్రబాబే కారణమన్నారు.


పెట్టుబడిదారి విధానాన్ని అమలు చేసే దేశాలు కరోనా వైరస్ ( Corona virus ) కట్టడిలో విఫలమయ్యాయని సీపీఎం పార్టీ స్పష్టం చేసింది.  కేవలం సోషలిస్టు దేశాలే కరోనా నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడాయన్నారు. క్యూబా దేశం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని.. ఇండియా స్థానం కూడా 104 నుంచి 90కి పడిపోయిందని చెప్పారు.  ప్రభుత్వాలనేవి ప్రజల కొనుగోలు శక్తి పెంచాలని..కానీ ఇక్కడ మాత్రం అంబానీ, అదానీ ఆస్థులు పెరుగుతున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందని..ఆర్థిక వ్యవస్థ కుంటు పడేలా చేసిందని మండిపడ్డారు. Also read: AP: భారీగా తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు