AP CS TENURE EXTEND: సీఎం జగన్ కు బీజేపీ ఫుల్ సపోర్ట్.. మోడీకి అంత ప్రేమెందుకో?
AP CS SAMEER SHARMA:సీఎం జగన్మోహన్ రెడ్డి వినతితో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవి కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. తాజా పొడిగింపుతో నవంబర్ 30 వరకు సీఎస్ గా పని చేయనున్నారు సమీర్ శర్మ. ఇప్పటికే సమీర్ శర్మకు ఓసారి ఆరు నెలల పొడిగింపు వచ్చింది. తాజాగా మరో సారి ఎక్స్ టెన్షన్ రావడంతో.. దేశంలోనే అరుదైన అధికారిగా నిలిచారు సమీర్ శర్మ.
AP CS SAMEER SHARMA: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దూకుడు పెంచింది. ఏపీ కమలం నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. సీఎం జగన్ తీరును ఎండగడుతున్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. జిల్లాలు చుట్టేస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్..జగన్ పై విరుచుకుపడుతున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో జగన్ టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతుందనే సిగ్నల్ వస్తోంది. కాని బీజేపీ హైకమాండ్ వైఖరి మాత్రం మరోలా కనిపిస్తోంది. ఏపీ సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి కేంద్రం పెద్దలు పూర్తిగా మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా ఏపీ సీఎస్ కు సమీర్ శర్మకు ఆరు నెలల ఎక్స్ టెన్షన్ ఇవ్వడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి వినతితో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవి కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. తాజా పొడిగింపుతో నవంబర్ 30 వరకు సీఎస్ గా పని చేయనున్నారు సమీర్ శర్మ. ఇప్పటికే సమీర్ శర్మకు ఓసారి ఆరు నెలల పొడిగింపు వచ్చింది. తాజాగా మరో సారి ఎక్స్ టెన్షన్ రావడంతో.. దేశంలోనే అరుదైన అధికారిగా నిలిచారు సమీర్ శర్మ. ఏపీలో ఆరు నెలలకు మించి పదవి కాలం పొడిగింపు పొందిన తొలి అధికారిగా సీఎస్ సమీర్ శర్మ రికార్డ్ సాధించారు. గతంలో నీలం సాహ్నీ, ఆదిత్యనాథ్ దాస్ కు మూడు నెలల పాటు రెండు సార్లు పొడగింపు ఇచ్చింది మోడీ సర్కార్. సమీర్ శర్మకు మాత్రం రెండు సార్లు.. ఆరు నెలల పాటు పొడగింపు ఇచ్చింది. ఇలా జరగడం చాలా అరుదు అంటున్నారు. 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ.. 2021 నవంబర్ 30వ తేదీనే రిటైర్ కావాల్సి ఉంది. కాని వరుస పొడిగింపులతో ఏడాది అదనంగా విధులు చేయనున్నారు. 2022 నవంబర్ 30న ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. గతంలో యూపీ, బీహార్ సీఎస్ లకు మాత్రమే ఇలాంటి ఛాన్స్ ఇచ్చారు. దీంతో సీఎం జగన్ కు కేంద్రంగా ఎంతగా ప్రాధాన్యత ఇస్తుందో అర్ధమవుతోంది.
సీఎస్ కు ఆరు నెలల పొడిగింపు ప్రధాని జోక్యం లేకుండా జరగదని అంటున్నారు. సమీర్ శర్మ ఎక్స్ టెన్షన్ పై సీఎం జగన్ లేఖ రాసిన లేఖకు పీఎంవో అధికారులు కూడా తాము ఏమి చేయలేమని... ప్రధానితో మాట్లాడుకోవాలని స్పష్టం చేశారట. దీంతో ఏప్రిల్ 12న ప్రధాని మోడీతో సమావేశమైన సీఎం జగన్.. సీఎస్ పదవి కాలం పొడిగించాలని కోరారట. జగన్ వినతికి ప్రధాని ఓకే చెప్పారని తెలుస్తోంది. సాధారణంగా కొవిడ్, విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే అలాంటి ఎక్స్ టెన్షన్లు ఇస్తుంటారు. కాని ప్రస్తుతం ఏపీలో కొవిడ్ కంట్రోల్ లోనే ఉంది. ఇతరత్రా అసాధారణ పరిస్థితులు కూడా లేవు. అయినా సీఎస్ కు ఏడాది ఎక్స్ టెన్షన్ ఇవ్వడం మామూలు విషయం కాదంటున్నారు నిపుణులు. తాజా నిర్ణయంతో కేంద్ర దగ్గర సీఎం జగన్ పలుకుబడి ఎలా ఉందో తెలుస్తుందంటున్నారు. ప్రధాని మోడీపై ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ప్రేమ చూపిస్తున్నారని చెబుతున్నారు.
ఇక్కడ మరో అంశం కూడా ఆసక్తిగా ఉంది. తెలంగాణలో పోలిస్తే ఏపీలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇప్పటికే పరిమితికి మంచి అప్పులు చేసింది జగన్ సర్కార్. అయినా ఏపీ ప్రభుత్వానికి కొత్త అప్పులకు కేంద్ర అనుమతి ఇస్తోంది. అదే సమయంలో తెలంగాణ సర్కార్ ఎన్నివినతలు చేసినా అప్పుకు అనుమతి ఇవ్వడం లేదు. ఇక్కడ కూడా ఏపీపై కేంద్రం సానుకూలత కనిపిస్తోంది. ఇందుకు రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు.త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓట్లు కీలకం. మొదటి నుంచి మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటోంది వైసీపీ. ప్రెసిడెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకే సపోర్ట్ చేస్తారని తెలుస్తోంది. అటు ఏపీలో ఇప్పట్లో బీజేపీ బలపడే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఏపీలో జగన్ ను తమకు అనుకూలంగా ఉంచుకోవాలని బీజేపీ పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
READ ALSO: Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?
READ ALSO: Ycp Leaders: వైసీపీ నేతల మధ్య సఖ్యత కుదిరిందా..అధిష్టానం ఏం చెబుతోంది..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.