జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి  తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని రమణ దీక్షితులు చెప్పిన విషయంపై పవన్ ట్వీట్స్ చేసిన క్రమంలో కేఈ కృష్ణమూర్తి స్పందించారు. కోహినూర్ వజ్రం కోసమే భారతదేశం ఇంత కాలం పోరాటం చేస్తుందని.. అలాంటి సాక్షాత్తు శ్రీవారి నగలే చోరికి గురైనా... టీడీపీ స్పందించకపోవడానికి కారణమేంటని పవన్ ట్వీట్స్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ట్వీట్స్ పై కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నవన్నీ గాలిమాటలు అని తెలిపారు. ఆయన ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని తెలిపారు. శ్రీవారి నగల విషయం పై ఇప్పటికే కమిటీలు నివేదికలు పంపాయని.. అలాంటప్పుడు పవన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని కేఈ అన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగాకే పవన్ మాటలు కోటలు దాటుతున్నాయని అన్నారు. 


పవన్ కళ్యాణ్ అయిన దానికి కాని దానికి ఆరోపణలు చేయడం కోసమే ట్విట్టర్ వాడుతున్నారని కేఈ కృష్ణమూర్తి అన్నారు. మొత్తానికి చూసుకుంటే వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ కలిసి టీడీపీపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.