Ap deputy cm pawan kalyan worship lord surya bhagavan: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల టీడీపీ, జనసేన, బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా.. ప్రజలు కూటమిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఏపీలో కూడా సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏపీ గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఎలా నష్టపోయిందో తెలియజేస్తునే.. మరోవైపు ఏపీ డెవలప్ మెంట్ కోసం అనేక ప్రణాళికలు వేస్తున్నారు.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే రాజకీయా నేతలకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తనదైన స్టైల్ లో పాలనలో దూసుకుపోతున్నారు. ఒక తల్లి తన బిడ్డ తొమ్మిది నెలల  నుంచి కన్పించడంలేదని, కన్నీళ్లు పెట్టుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనసేనానికి రంగంలోకి దిగి కేవలం తొమ్మిది రోజుల్లోనే యువతిజాడను కనిపెట్టి ఆ తల్లి కడుపుకొత తీర్చారు. ఈ క్రమంలో.. పవన్ కళ్యాన్ ప్రస్తుతం వారాహి అమ్మవారి ఏకాదశ దీక్షలో ఉన్నారు. ఇటీవల తెలంగాణలోని కొండగట్టు అంజన్న స్వామిని కూడా పవన్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లో సూర్యరాధనను పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒకవైపు వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష, మరోవైపు సూర్యరాధన చేయడం కూడా ఇప్పుడు వార్తలలో నిలిచింది.


సూర్యారాధన ఎందుకు చేస్తారు..


మనకు కళ్లముందు కన్పించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. మనం చేసే ప్రతిపనికి కూడా ఆయన కర్మసాక్షి అని చెబుతుంటారు. నవగ్రహాలలో సూర్యుడి మధ్యలో ఉంటారు. విష్ణువు అలంకార ప్రియుడు, అదే విధంగా శివుడు అభిషేక ప్రియుడు, ఇక సూర్యుడు మాత్రం కేవలం నమస్కారం చేస్తే మనం కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడని పండితులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసే వారికి ఎలాంటి శారీరక, మానసిక సమస్యలు ఉండవని కూడా పండితులు సూచిస్తుంటారు.


ఇటు సూర్యనమస్కారాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని సైంటిఫిక్ గా కూడా రుజువైంది. అదే విధంగా గ్రహాలలో కూడా సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు. సూర్యుడి సతీమణి ఛాయాదేవీ, వీరికి యముడు, శని దేవుళ్లు ఇద్దరు సంతానం. అందుకే సూర్యుడ్ని ఆరాధిస్తే, ఇటు శనిబాధలు, అటు అకాలంగా చనిపోయవడం వంటి దోషాలు ఉండవని పండితులు చెబుతుంటారు. సూర్యుడు సమస్తమైన లోకాలకు వెలుగును ప్రసాదిస్తాడు.వెలుతురు లేకుండా మన జీవితంలో అల్లకల్లోలంగా మారిపోతుంది. అందుకే సూర్యుడిని అందరు భక్తితో కొలుస్తారు.


శక్తి వంతమైన  ఆదిత్య హృదయం స్తోత్రం..



రావణ వధ సమయంలో శ్రీరామ చంద్రుడు సైతం..  ఆదిత్య హృదయంను మూడు సార్లు చదివి రావణుడి మీద బాణం వదిలారు. అంటే  ఆదిత్య హృదయం ఎంత పవిత్రమైందో అర్థం చేసుకొవచ్చు. ఆదిత్యుడిని రోజు పూజిస్తే శత్రువుల బాధ ఉండదు. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఆదిత్యుడిని నిత్యం పూజిస్తే గత జన్మలో తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. దీర్ఘకాల అనారోగ్యం నుంచి బైటపడుతాం. మనసులో అనుకున్న పనులన్ని నిర్వఘ్నంగా పూర్తవుతాయి. అపమృత్యు భయం తొలగిపోతుంది. ఇంకా జ్ఞానం , విజ్ఞానానికి , మానసిక ప్రశాంతత సాధించేందుకు ఉత్తమమార్గం సూర్యారాధన. మన కర్మలను మనసు నియంత్రిస్తే..ఆ మనసుని నియంత్రించేది చంద్రుడు.. ఆ చంద్రుడికి కూడా వెలుగును అందించేవాడు సూర్యుభగవానుడు. వీటన్నింటికి కారకుడైన సూర్య భగవానుడిని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు మంచి ఫలితాలు పొందారు. 



దేశ సర్వతోముఖాభివృద్ధికి పూజలు..


మనదేశం అన్నిరంగాలలో కూడా సర్వతోముఖాభివృద్ధిలోకి దూసుకొని పోవడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూర్యరాధన, వారాహి అమ్మవారి పూజలు చేస్తున్నట్లు ఆయన టీం తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా.. రాజశ్యామల అమ్మవారి పూజలను భక్తితో చేసేవారు. ఈ క్రమంలో పవన్ కూడా ప్రస్తుతం వారాహి అమ్మవారు, సూర్యరాధన చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి