Pawan kalyan puja at Kondagattu hanuman temple: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇష్టమైన దైవం కొండగట్టు అంజన్నను ఈరోజు (జూన్29) న దర్శించుకొనున్నారు. ఇప్పటికే తెలంగాణ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి అమరావతి నుంచి హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ లో రోడ్డు మార్గం ద్వారా అంజన్న ఆలయానికి వెళ్లనున్నారు. పవన్ రాక నేపథ్యంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున కొండగట్టుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కొండగట్టులో రెండు వేల మంది వరకు పోలీసులను మోహరించినట్లు తెలుస్తోంది. కొండగట్టు అంజన్నను పవన్ చాలా సెంటిమెంట్ గా భావిస్తారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..


గతంలో వారాహికి ప్రచార వాహనానికి సైతం..తొలిపూజ కొండగట్టులోనే నిర్వహించారు.దీనితో పాటు కూటమి పొత్తులను ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం. ఏపీలో ఇటీవల కూటమిపార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. పవన్ అనూహ్యంగా వందశాతం స్టైక్ రేట్ ను సాధించారు. అంతేకాకుండా.. డిప్యూటీ సీఎం తో పాటు, ముఖ్యమైన శాఖలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. పవన్ ఇప్పటికే ఆయాశాఖల అధికారులతో నిరంతరం సమావేశాలు జరుపుతున్నారు.


ఈ క్రమంలో ఇటీవల యువత ఐఏఎస్ అధికారి కృష్ణతేజ‌‌ ను సైతం తన ఓఎస్టీగా నియమిచుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. అంతేకాకుండా..ఈ  దీక్షలోనే ఉండి అధికారులతో నిరంతరం బిజీగా ఉంటున్నారు. అంజన్న ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు శనివారం వీకెంట్ కావడం, మరోవైపు పవన్ రానుండటంతో కొండగట్టు ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మరోవైపు దారి పొడగున పవన్ ను స్వాగతం చెబుతూ ఆయన అభిమానులు ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.


Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..


ఆలయంలో డిప్యూటీసీఎంకు ప్రత్యేకంగా స్వాగతం పలికి, వేదాశీర్వదాం ఇచ్చేందుకు ఇప్పటికే అధికారులు అన్నిరకాల చర్యలు చేపట్టారు. మరోవైపు పూజల అనంతరం పవన్ తిరిగి రోడ్డుమార్గానే హైదరాబాద్ కు వెళ్లిపోతారని తెలుస్తోంది. ఇటు జనసేన, పవన్ అభిమానులు భారీ ఎత్తున కొండ గట్టుకు చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కొండ గట్టు అంజన్న దర్శనం అనంతరం చేనేత కార్మికులు, జనసేన కార్యకర్తలతో కాసేపు సమావేశం నిర్వహిస్తారని సమాచారం. పోలీసులు కూడా అదే విధంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి