DGP Gowtham Sawang: పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్రకోణం దాగుందా
DGP Gowtham Sawang: తెలుగుదేశం నేత పట్టాభి వ్యాఖ్యలపై పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్రకోణం దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్యాప్తు ప్రారంభించారు.
DGP Gowtham Sawang: తెలుగుదేశం నేత పట్టాభి వ్యాఖ్యలపై పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్రకోణం దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్యాప్తు ప్రారంభించారు.
ఏపీలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యల్ని(Tdp Leader Pattabhi Comments)రాష్ట్ర పోలీసు యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. పట్టాభి మాటలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది..చాలా దారుణ భాష అని గౌతమ్ సవాంగ్ అన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారిపై దుర్భాషలాడటం సరికాదన్నారు. పట్టాభి వ్యాఖ్యల అనంతరం ఆందోళనలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఓ పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇటువంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరని.. పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదని కూడా చెప్పారు. రాజకీయ పార్టీలకు బాధ్యతనేది ఉండాలని డీజీపీ హితవు పలికారు.
టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటేశాయని గౌతమ్ సవాంగ్(DGP Gowtham Sawang)తెలిపారు. ఒకసారి కాదు..పదే పదే దూషణలు చేశారని చెప్పారు. నిరాధార ఆరోపణలు మంచిది కాదన్నారు. విజయవాడకు డ్రగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేదన్నారు. అయినా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్‌తో(Gujarat Drugs Case)ఏపీకి సంబంధం లేదని..ఒక్క గ్రామ్ కూడా విజయవాడకు రాలేదని చెప్పారు. ఇక పట్టాభి వ్యాఖ్యల వెనుక కుట్రకోణం దాగుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. గత కొన్నిరోజులుగా చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తామని..ఎటువంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతామన్నారు. మరోవైపు రేపు ఫ్లాగ్ డే నిర్వహించనున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్(Gowtham Sawang) చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాన్ని మర్చిపోలేమన్నారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో పోలీసులు చేసిన సేవ మరువలేనిదన్నారు.
Also read: Jagananna Thodu Scheme: జగనన్నతోడు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి