Jagananna Thodu Scheme: జగనన్నతోడు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ

Jagananna Thodu Scheme: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. సంక్షేమ పథకాల్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షనేతలు రాజకీయాలు చేస్తున్నారని..బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు జగన్. కావాలని వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మరవైపు జగనన్నతోడు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 20, 2021, 02:22 PM IST
  • రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మండిపడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక వైషమ్యాలు రెచ్చగొడుతుందని జగన్ వ్యాఖ్యలు
  • జగనన్నతోడు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన వైఎస్ జగన్
Jagananna Thodu Scheme: జగనన్నతోడు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ

Jagananna Thodu Scheme: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. సంక్షేమ పథకాల్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షనేతలు రాజకీయాలు చేస్తున్నారని..బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు జగన్. కావాలని వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మరవైపు జగనన్నతోడు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress Party), ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం తీవ్రమై ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అటు టీడీపీ తలపెట్టిన రాష్ట్రబంద్‌కు అంతంతమాత్రంగా స్పందన లభించింది. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షనేతలు బూతులు తిడుతూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరూ ఎపుడూ మాట్లాడని విధంగా బూతులు మాట్లాడుతున్నారని..టీడీపీ(TDP)నేతలు కావాలనే వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని జగన్ విమర్శించారు. ప్రతిమాటలో, రాతలో వంచన స్పష్టంగా కన్పిస్తోందన్నారు. మత విద్వేషాల్ని రెచ్చగొట్టేందుకు కూడా తెలుగుదేశం(Telugu Desam)వెనుకాడటం లేదన్నారు. ప్రతిపక్షం ఎలా తయారైందనేది ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థతో కుల, మత, ప్రాంత, పార్టీలతో నిమిత్తం లేకుండా పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)గుర్తు చేశారు. జగనన్నతోడు కార్యక్రమంలో భాగంగా లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ చేసిన జగన్ రాష్ట్రంలోని పరిణామాలపై స్పందించారు. జగనన్నతోడు(Jagananna Thodu)లబ్దిదారుల ఖాతాల్లో 16.36 కోట్ల రూపాయల్ని జమ చేశారు. తొలి విడత జగనన్నతోడు కింద రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 4.5 లక్షలమంది చిరు వ్యాపారులకు లబ్ది చేకూరనుంది. ఇప్పటివరకూ 9.05 లక్షలమందికి ప్రభుత్వం 950 కోట్ల రూపాయల రుణం అందించింది. సుదీర్ఘ పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాల్ని స్వయంగా చూసి..ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు. ఈ పథకం ద్వారా వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిన్న వ్యాపారులకు విముక్తి లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఏడాదికి పదివేల రూపాయలు వడ్డీలేని రుణం అందిస్తున్నామన్నారు. ఏడాదిలో రెండుసార్లు అంటే డిసెంబర్, జూన్ నెలల్లో ఈ కార్యక్రమం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రుణాలు చెల్లించినవారికి కొత్త రుణాలు ఇవ్వడమే కాకుండా కొత్త రుణాలతో కట్టిన వడ్డీని వాపసు చేస్తామన్నారు. 

Also read: Buddha Venkanna Arrest:ఆంధ్రలో హైటెన్షన్...రోడ్లపై టీడీపీ నేత బుద్దా వెంకన్న కర్రలతో హంగామా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News