AP DSC Application: ఏపీ డీఎ్సీ నోటిఫికేషన్ వెలువడి 15 రోజులౌతోంది. రోజుల తరబడి ఎంపిక ప్రక్రియను సాగదీయకుండా ఏప్రిల్ నాటికి ఫలితాలు వెలువడేలా ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే మీరు అప్లై చేయకుంటే ఇవాళే చివరి తేదీ. వెంటనే దరఖాస్తు చేసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 6100 టీచర్ పోస్టుల భర్తీకు డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేసింది. అదే రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వాస్తవానికి ఫిబ్రవరి 21తోనే గడువు ముగియాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 25 అంటే ఇవాళ్టి వరకూ పొడిగించారు. ఈసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం పగడ్బందీగా రూపకల్పన చేసింది. రోజుల తరబడి ప్రక్రియను కొనసాగించకుండా చాలా వేగంగా అంటే ఏప్రిల్ నాటికి ఫలితాలు విడుదల చేసేలా సిద్ధం చేసింది. 


డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం మార్చ్ 15 నుంచి మార్చ్ 30 వరకూ పరీక్షలు జరగనున్నాయి. రోజూ ఉదయం 9.30 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ తరువాత మద్యాహ్నం 2.30 గంటల్నించి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. మార్చ్ 31వతేదీన కీ విడుదల చేసి ఏప్రిల్ 3 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తరువాత ఏప్రిల్ 8న ఫైనల్ కీ విడుదలవుతుంది. ఇక ఏప్రిల్ 15న ఫలితాలు విడుదల కానున్నాయి. 


ఈసారి వెలువడిన డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 6100 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 2280, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు 2229, టీజీటీ పోస్టులు 1264, పీజీటీ పోస్టులు 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి. డీఎస్సీలో ఎంపికైనవారికి జూన్ 8వ తేదీన పోస్టింగులు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని జిల్లా పరిషత్, మున్సిుపల్, కార్పొరేషన్, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, గురుకులం విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీ ఉంటుంది. 


ఈసారి నిరుద్యోగులకు గరిష్ట వయో పరిమితి 44 ఏళ్లు కాగా, ఎస్సీ-ఎస్టీ-బీసీలకు మరో ఐదేళ్లు మినహాయింపు ఉంటుంది. దివ్యాంగులకు అయితే 54 ఏళ్ల వరకూ వయో పరిమితి నిర్దారించారు. ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బరంపూర్‌లో కూడా పరీక్షా కేంద్రాలున్నాయి. పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. 


Also read: Policy Porting: హెల్త్ పాలసీ పోర్టింగ్ అంటే ఏమిటి, కలిగే ప్రయోజనాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook