Policy Porting: హెల్త్ పాలసీ పోర్టింగ్ అంటే ఏమిటి, కలిగే ప్రయోజనాలేంటి

Policy Porting: ఇప్పటివరకూ మనకు మొబైల్ నెంబర్ పోర్టిబిలిటీ గురించి తెలుసు. నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడం లేదా టారిఫ్ నచ్చకపోవడం ఇలా వివిధ కారణాలతో అదే నెంబర్‌తో నచ్చిన నెట్‌వర్క్‌కు మారిపోతుంటాం. మరి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ నచ్చకపోతే..ఆ వివరాలు మీ కోసం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 25, 2024, 07:03 AM IST
Policy Porting: హెల్త్ పాలసీ పోర్టింగ్ అంటే ఏమిటి, కలిగే ప్రయోజనాలేంటి

Policy Porting: ఇటీవలి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోంది. అందరికీ మెడికల్ పాలసీలు ఉంటున్నాయి. చాలా సందర్భాల్లో పాలసీలో తలెత్తే వివిధ రకాల ఇబ్బందుల వల్ల పాలసీ కేన్సిల్ చేసి మరో కంపెనీ పాలసీ తీసుకుంటుంటారు. దీనివల్ల అటు సమయం ఇటు డబ్బులు రెండూ వృధా అవుతుంటాయి. దీనికి సమాధానమే పాలసీ పోర్టింగ్. అంటే మొబైల్ నెంబర్ పోర్టిబిలిటీలాంటిది.

మెడికల్ పాలసీలు తీసుకునేముందు చాలా విషయాల్ని పరిగణలో తీసుకోవాలి. కంపెనీ ట్రాక్ రికార్డ్, క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ రేషియో, ఇతర ప్రయోజనాలు అన్నీ బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్‌లో చాలా కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. ఏది బెటర్, ఏది కాదనేది చాలా సునిశితంగా తెలుసుకోవాలి. ఒకవేళ తీసుకున్న తరువాత ఏమైనా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే మరో కంపెనీకు బదిలీ అవడం సాధ్యమేనా అంటే సాధ్యమే. అంటే పోర్టిబిలిటి. మొబైల్ నెంబర్ పోర్టిబిలిటీ చేసుకున్నట్టు పాలసీ పోర్టిబిలిటీ చేసుకోవచ్చు. పోర్టిబిలీటీతో అసలు లాభమా, నష్టమా అనేది కూడా పరిశీలిద్దాం.

ప్రీమియం ఎక్కువగా ఉండటం, క్లెయిమింగ్ ప్రక్రియలో ఇబ్బందులు, ఇతర ప్రయోజనాల్లేకపోవడం పాలసీదారులుకు ఇబ్బందులెదురౌతుంటాయి. అలాగని పాలసీ మద్యలో వదిలేసి ఇంకోటి తీసుకోవడం సాధ్యం కాదు. అప్పటి వరకూ వెచ్చించిన డబ్బులు వృధా అవుతాయి. దీనికి సమాధానమే పాలసీ పోర్టింగ్. నచ్చిన మరో కంపెనీకు పాలసీను బదిలీ చేసుకోవడం. చాలాకాలంగా ఎదురుచూసిన ఆరోగ్య భీమా పోర్టిబిలిటీ నిబంధనలు  2011 జూలైలో అమల్లోకి వచ్చాయి. పాలసీదారులు నచ్చిన సంస్థలోకి పాలసీని పోర్ట్ చేసుకోవచ్చు. పాలసీ పోర్టింగ్ వల్ల కలిగే మొదటి ప్రయోజనం వెయిటింగ్ పీరియడ్. అంటే ఏ పాలసీ అయినా సరే అప్పటికే ఉన్న వ్యాధులకు తక్షణం చికిత్స లభించదు. కొద్దికాలం ఆగాల్సి ఉంటుంది. పాలసీ పోర్టింగ్ వల్ల వెయిటింగ్ పీరియడం కలిసి వస్తుంది. 

మరోవైపు ఒక కంపెనీ పాలసీ నుంచి మరో కంపెనీ హెల్త్ పాలసీకు మారినప్పుడు డిఫరెన్స్ డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మొత్తం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే ముందున్న కంపెనీలో ప్రీమియం 18 వేలనుకుంటే..పోర్టింగ్ కంపెనీలో 22 వేలుంటే..డిఫరెన్స్ 4 వేలు చెల్లిస్తే అవే ప్రయోజనాలతో అదే పాలసీ నెంబర్‌తో హెల్త్ ఇన్సూరెన్స్ కొనసాగుతుంది. 

Also read: Bra and Breast Cancer: బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ కేన్సర్ వస్తుందా, నిజానిజాలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News