APEAPCET 2023: ఏపీఈఏపీసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల, చివరి తేదీ, పరీక్ష ఎప్పుడంటే
APEAPCET 2023: ఏపీలోని కీలకమైన ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకై నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి ఏపీఈఏపీసెట్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
APEAPCET 2023: ఏపీలో 2023-24 విద్యా సంవత్సరపు వివిధ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీఈఏపీసెట్ నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
ఏపీఈఏపీసెట్ పరిధిలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి వివిధ కళాశాలల్లో అడ్మిషన్లకై ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. దీంతోపాటు ఇంజనీరింగ్ రెండవ ఏడాదిలో ప్రవేశానికి సంబంధించి ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌కు దరఖాస్తు చేసేందుకు చివరి తేదీతో పాటు పరీక్షల తేదీని కూడా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
ఏపీఈఏపీసెట్ మార్చ్ 10న షెడ్యూల్ విడుదల కానుండగా, ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష మే 15-18 తేదీల్లో ఏపీసీ గ్రూప్‌కు , మే 22-23 తేదీల్లో బైపీసీ గూప్‌కు ఉంటుంది. ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు మార్చ్ 11-ఏప్రిల్ 15 వరకూ సమయముంటుంది. హాల్ టికెట్స్ మే 7న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివిధ రకాల పెనాల్టీతో వేర్వేరు గడువు తేదీలున్నాయి.
ఇక ఈసెట్ పరీక్షకు మార్చ్ 8న షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో మే 5న ఉంటుంది. హాల్ టికెట్లను ఏప్రిల్ 28న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చ్ 10-ఏప్రిల్ 10 వరకూ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐసెట్ పరీక్ష మార్చ్ 17వ తేదీన షెడ్యూల్ విడుదల కానుంది. ఆన్‌లైన్ విధానంలో ప్రవేశపరీక్ష మే 24,25 తేదీల్లో ఉంటుంది. హాల్ టికెట్లను మే 20న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు మార్చ్ 20-ఏప్రిల్ 19 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. సులభంగా చెప్పాలంటే ఏపీఈఏపీసెట్ పరీక్ష మే 15-23 వరకూ, ఈసెట్ పరీక్ష మే 5న, ఐసెట్ మే 24,25 తేదీల్లో జరగనున్నాయి.
Also read: Janhvi kapoor pics: జాన్వీ కపూర్‌ని జాకెట్ లేకుండా చీరకట్టులో ఎప్పుడైనా చూశారా, మీ కోసమే ఈ పిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook