Ap Panchayat Elections 2021 Reschedule: పంచాయితీ ఎన్నికల్ని రీ షెడ్యూల్ చేసిన ఎన్నికల సంఘం
Ap Panchayat Elections 2021 Reschedule: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు రీ షెడ్యూల్ అయ్యాయి. ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో..హడావిడిగా ఎన్నికల్ని రీ షెడ్యూల్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం..
Ap Panchayat Elections 2021 Reschedule: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు రీ షెడ్యూల్ అయ్యాయి. ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో..హడావిడిగా ఎన్నికల్ని రీ షెడ్యూల్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం..
రాష్ట్ర ప్రభుత్వానికి ( Ap Government ), ఎన్నికల సంఘానికి ( Election Commission ) మధ్య తలెత్తిన పంచాయితీ ఎన్నికల ( Panchayat Elections 2021 ) వివాదం సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని..తరచూ వాయిదా వేయకూడదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు..ఎన్నికల కమీషన్ నిర్ణయాల్లో కలుగజేసుకోమని స్పష్టం చేసింది. పంచాయితీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఎన్నికలకు సుప్రీంకోర్టు ( Supreme Court ) పచ్చజెండా ఊపగానే.. ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల్ని రీషెడ్యూల్ చేసింది.
రెండోదశ ఎన్నికల్ని తొలిదశగా మారుస్తూ రీషెడ్యూల్ ( Panchayat Elections reschedule ) ప్రకటించింది. మూడవ దశ ఎన్నికల్ని రెండవదశగా..నాలుగవ దశను మూడవ విడతగా మార్చింది. మొదటి దశ ఎన్నికల్ని మాత్రం నాలుగవ దశకు మార్చింది. ఎన్నికల ఏర్పాట్లు ఇంకా పూర్తికాకపోవడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం..ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశ ఎన్నికలు జనవరి 29 నుంచి, రెండవ దశ ఫిబ్రవరి 2 నుంచి, మూడవ దశ ఫిబ్రవరి 6 నుంచి, నాలుగోదశ ఫిబ్రవరి 10 నుంచి నామినేషన్లు జరగనున్నాయి.
Also read: Supreme court on local elections: పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook