AP Elections 2024: ఏపీలో ఈసారి అధికారం ఎవరిది, సంచలనం రేపుతున్న తాజా సర్వే
AP Elections 2024: ఏపీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కుతోంది. అభ్యర్దుల మార్పులతో వైసీపీ దూసుకుపోతుంటే..ప్రతిపక్షం టీడీపీ-జనసేన కూటమి పొత్తు సమీకరణాల్లో నిమగ్నమైంది. ఈలోగా ఏపీలో ఈసారి అధికారం ఎవరిదనే విషయంపై జరిగిన తాజా సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
AP Elections 2024: ఏపీలో ఈసారి పోటీ త్రిముఖంగా ఉంటుందా లేక చతుర్ముఖమా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగనుండగా జనసేన-టీడీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి ఇక బీజేపీ ఈ కూటమిలో చేరుతుందా లేక ఒంటరిగా బరిలో దిగుతుందా అనేది ఇంకా తేలలేదు. అటు వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగనుంది.
ఏపీలో ఈసారి జరుగుతున్న ఎన్నికలు అటు అధికార పార్టీకు ఇటు ప్రతిపక్షాలకు జీవన్మరణ సమస్యగా మారనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో భారీ మార్పులు చేర్పులతో ఇప్పటికే 4 జాబితాలు విడుదల చేయగా ప్రతిపక్షం టీడీపీ-జనసేన ఫిబ్రవరి మొదటి వారంలో జాబితా విడుదల చేయనుంది. మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఏపీలో అధికారం ఎవరిదనే విషయంపై తాజాగా పొలిటికల్ క్రిటిక్ సంస్థ సర్వే జరిపింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 48 శాంత ఓట్లు, టీడీపీ-జనసేన కూటమికి 44 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపింది. ఇక బీజేపీకు 1.5 శాతం, కాంగ్రెస్ పార్టీకు 1.5 శాతం ఓట్లు దక్కవచ్చని వెల్లడించింది. ఇతరులకు మరో 5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక అసెంబ్లీ సీట్ల విషయాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 115 స్థానాలు, టీడీపీ-జనసేన పార్టీలు 60 స్థానాలు గెల్చుకోనున్నాయి.
ఇక లోక్‌సభ ఎన్నికల్లో అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 సీట్లు, టీడీపీ-జనసేన కూటమి 7 సీట్లు సాధించవచ్చని అంచనా. లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 48.5 శాతం ఓట్లను, టీడీపీ-జనసేన కూటమి 45 శాతం ఓట్లను దక్కించుకోనున్నాయి. ఇక బీజేపీ 2 శాతం, కాంగ్రెస్ పార్టీ 2 శాతం ఓట్లు దక్కించుకుంటే ఇతరులు మరో 2.5 శాతం ఓట్లు దక్కించుకుంటాయని పొలిటికల్ క్రిటిక్ సంస్థ తెలిపింది.
Also read: China Earthquake: చైనాలో భారీ భూకంపం, ఢిల్లీ వరకూ ప్రకంపనలు, భారీగా ఆస్థి, ప్రాణ నష్టం
Also read: Anganwadi Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం, సమ్మె విరమించిన అంగన్‌వాడీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook