Anganwadi Strike: జీతాల పెంపుకై అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెతో గత కొద్దికాలంగా ఏపీ ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయం కావడంతో ప్రతిపక్షాలు ఈ అంశంపై రాద్ధాంతం చేయడం ప్రారంభించాయి. ఇప్పుడీ సమస్య నుంచి ప్రభుత్వం గట్టెక్కింది. సమ్మె విరమిస్తున్నట్టు అంగన్‌వాడీలు ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వంతో అంగన్‌వాడీల చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. ఈ నెల 24న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం నిన్న రాత్రి మరోసారి చర్చలకు పిలిచింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలు, డిమాండ్లను పరిశీలించారు. ఇప్పటికే చాలా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించగా మిగిలినవాటిపై సానుకూలంగానే ఉన్నట్టు తెలిపారు. అంగన్‌వాడీలు ప్రభుత్వం మందు ఉంచిన 11 డిమాండ్లలో 10 నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు. జీతాల పెంపును జూన్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్‌వాడీలు అంగీకరించారు. డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవడంతో ఇక తక్షణం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.
అంగన్‌వాడీ టీచర్ల పదవీ విరమణ ప్రయోజనాలను 1.20 లక్షలు, హెల్పర్లకు అయితే 60 వేలకు పెంచినట్టు మంత్రి బొత్తస వివరించారు. ఇక పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లు చేశారు. మినీ అంగన్‌వాడీలను అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. అంగన్‌వాడీలపై నమోదైన కేసులను ముఖ్యమంత్రి జగన్‌తో చర్చించి ఎత్తివేస్తామని, సమ్మె కాలంలో జీతాలపై కూడా ముఖ్యమంత్రిదే నిర్ణయమన్నారు. సమ్మె విరమణ ప్రకటన చేసినందుకు అంగన్‌వాడీలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.
Also read: Ys Jagan Strategy: ఎన్నికల వేళ మరో మూడు తాయిలాలకు సిద్ధమౌతున్న జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook