AP Assembly Elections Latest Survey: ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది పూటకో సర్వే బయటకు వస్తున్నాయి. ఈ  నేపథ్యంలో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై మరో సర్వే సంచలనం రేపుతోంది.  ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి జమిలి ఎన్నికల జరుగుతున్నాయి. వచ్చే నెల 13న జరిగే పోలింగ్‌లో ఓటర్లు తమ తీర్పును నిక్షిప్తం చేయనున్నారు . ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఏపీలో పలు సర్వే సంస్థలు తాము  చేసిన సర్వేలను ప్రస్తావిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ సర్వే సంస్థలు 80 శాతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. కానీ ఇండియా టుడే - సీ ఓటర్ సంస్థ మాత్రం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికే అనుకూలంగా ఉన్నట్టు చెప్పింది. తాజాగా జన్ లోక్ పోల్ నిర్వహించిన సర్వే మాత్రం ఏపీలో కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు  పేర్కొంది. వీళ్లు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ సర్వే చేసినట్టు చెప్పుకొచ్చారు.  శాంపుల్ సర్వే మాత్రం పేర్కొనలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికిపుడు ఏపీలో ఎన్నికలు జరిగితే..
NDA -118 నుంచి 123 సీట్లు..
YSRCP - 49 నుంచి 54 సీట్లు..
INDIA కూటమికి 2 నుంచి 5 సీట్లు
ఇతరులు 1 నుంచి 5 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్టు ఈ సర్వే చెబుతోంది.


ఇందులో న్యూట్రల్ ఓటర్లు దాదాపు 3 నుంచి 5 శాతం వరకు ఉండే అవకాశాలున్నాయి. . వాళ్లు బలమైన క్యాండిడేట్స్ చూసి ఓట్లు వేస్తారు. వాళ్లను బట్టి రిజల్ట్స్ ఛేంజ్ అయ్యే అవకాశాలున్నాయి. వారు ఎటు వైపు మొగ్గితే.. అటు వైపు గాలి మళ్లే అవకాశాలున్నాయి. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 5 సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఖాతా ఓపెన్ చేస్తుందని చెప్పలేదు. ఆ స్థానాలు.. నియోజకవర్గాలు ఏంటో చెప్పలేదు. అటు ఇండిపెండెట్లు 1 నుంచి 5 వరకు గెలస్తుందని చెప్పుకొచ్చారు.  మొత్తంగా ఈ సర్వేను చూసి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది.
అటు న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం ఏపీలో NDA కు 18 ఎంపీ సీట్లు.. వైసీపీకి 7 ఎంపీ సీట్లు..
తెలంగాణలో 8 కాంగ్రెస్  ఎంపీ సీట్లు.. బీజేపీ 5 ఎంపీ.. బీఆర్ఎస్ 3 ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయిని పేర్కొంది.


Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter