MODI BABU MEET: నాలుగేళ్ల తర్వాత మోడీతో చంద్రబాబు భేటీ... బీజేపీ-టీడీపీ పొత్తుపై క్లారిటీ!
MODI BABU MEET: ఎన్నాళ్లకెన్నాళ్లకో తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఉత్సాహపరిచే సీన్ కనిపించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. ఇద్దరు కాసేపు మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని మోడీ.
MODI BABU MEET: ఎన్నాళ్లకెన్నాళ్లకో తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఉత్సాహపరిచే సీన్ కనిపించింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కలిశారు. ఇద్దరు కాసేపు మాట్లాడుతున్నారు. చంద్రబాబుతో ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని మోడీ. ఈ సీనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొత్త సమీకరణలకు కేంద్రమైంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయనే సంకేతం ఇస్తోంది.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడతో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏడాది పాటు దేశ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతోంది. ఆగస్టు 13,14,15 తేదీల్లో దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ మీటింగ్ ను శనివారం సాయంత్రం ఢిల్లీలో నిర్వహించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికిి అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులతో పాటు ముఖ్య నేతలను ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో ప్రధాని మోడీ సమావేశానికి హాజరయ్యారు చంద్రబాబు. 2018 తర్వాత మోడీతో చంద్రబాబు కలిసి ఒకే వేదికపై కనిపించింది ఈ సమావేశమే. కార్యక్రమం తర్వాత చంద్రబాబు వద్దకు వచ్చారు నరేంద్ర మోడీ. ఇద్దరూ కలిసి పక్కకు వెళ్లి 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య జరిగిన చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోడీతో పాటు కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా పలువురిని కలిశారు చంద్రబాబు.
2014లో టీడీపీ-బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంలో బీజేపీలో చేరింది. మోడీ కేబినెట్ లో ఇద్దరు టీడీపీ ఎంపీలకు బెర్త్ దొరికింది. అయితే ప్రత్యేక హోదా డిమాండ్ తో 2018లో ప్రధాని మోడీని విభేదించారు చంద్రబాబు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమించారు. కాంగ్రెస్ తో కలిసి పలు సమావేశాలు జరిపారు. ఒక రకంగా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు చంద్రబాబు. తిరుపతికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్ చేశారు. దీంతో టీడీపీ అధినేతపై బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కసితోనే 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి బీజేపీ సహకరించిందనే ప్రచారం ఉంది. చంద్రబాబు ఆర్థిక మూలాలను మోడీ సర్కార్ టార్గెట్ చేయడం జగన్ కు కలిసి వచ్చిందని అంటారు. అయితే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు రూట్ మారింది. మళ్లీ బీజేపీ పెద్దలతో సఖ్యతకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే వార్తలు వచ్చాయి. గతంలో జరిగిన పరిణామాలతో ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించలేదని చాక్ వచ్చింది. తాజాగా చంద్రబాబుకు పీఎంవో నుంచి ఆహ్వానం రావడం.. సమావేశం తర్వాత ప్రత్యేకంగా ప్రధాని మోడీ చంద్రబాబుతో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పార్టీల మధ్య మళ్లీ పొత్తు పొడుస్తుందా అన్న చర్చ సాగుతోంది.
ఏపీలో రాజకీయాలు కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటూ జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలన్ని కలిసి పోటీ చేయాలనే సంకేతం వచ్చేలా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆహ్వానించేలా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు త్యాగాలకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు. కొందరు టీడీపీ నాయకులు కూడా జనసేనతో పొట్టు ఉండాలని బహిరంగంగానే కామెంట్ చేశారు. టీడీపీ నేతల ప్రకటనలు, జనసేన తీరుతో 2014 తరహాలోనే వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడుతాయనే ప్రచారం సాగింది. అయితే ఈ విషయంలో బీజేపీ క్లారిటీ రాలేదు. టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు టీడీపీతో పొత్తు ఉండదని ఖరాకండిగా చెబుతుండగా.. సత్యకుమార్, లంకా దినకర్ వంటి నేతలు మాత్రం టీడీపీతో పొత్తుపై సానుకూలంగా స్పందిస్తున్నారు.
టీడీపీ-బీజేపీ పొత్తు విషయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో టీడీపీ చీఫ్ చంద్రబాబు సమావేశం కావడం.. ఇద్దరు నేతలు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో పర్యటించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీని ఆహ్వానించింది కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలతో కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లు టీడీపీ-బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబుతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడంపై టీడీపీ కేడర్ లో సంతోషం వ్యక్తమవుతోంది.
Also Read: Basara IIIT Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో గవర్నర్ తమిళి సై.. పోలీసుల ఆంక్షలపై సీరియస్
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook