Pawan Kalyan:  జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర చేశారన్న వార్తలు ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. పవన్ ను హత్య చేసేందుకు 250 కోట్ల సుపారీకి డీల్ ఇచ్చారని,  2019 ఎన్నికల ముందే ఇందుకు స్కెచ్ వేశారని  కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయంటూ ఒక న్యూస్ ఛానల్ లో వార్త వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జనసేన నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే  కొడాలి నాని ఈ విషయంలో స్పందించారు. పవన్ కల్యాణ్ పై మరోసారి ఆయన హాట్ కామెంట్స్ చేశారు.  పవన్  కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు కోటరీనే ఉందన్నారు. పవన్ కు  ఏం జరిగినా దానికి చంద్రబాబుదే బాధ్యత అని కొడాలి అన్నారు. పవన్ కు ఏం జరిగినా అందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సానుభూతి రాజకీయాల్లో చంద్రబాబును మించిన వారు లేరన్న కొడాలి నాని... రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఎంతకైనా తెగిస్తారని చెప్పారు. తనకు కలిసివస్తుందనుకుంటే  ఏదైనా చేస్తారని.. పవన్ విషయంలోనూ చంద్రబాబు అలాంటి నిర్ణయాలే తీసుకుంటారని తెలిపారు. పొత్తు కోసం పవన్ కల్యాణ్ 45 సీట్లు అడుగుతున్నాడు కాబట్టి ఆయనను చంపాలని చంద్రబాబు చూస్తాడని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ను ముంచినా తేల్చినా చంపినా బతికున్నా చంద్రబాబే  కారణమంటూ హాట్ కామెంట్స్ చేశారు కొడాలి నాని.


పవన్ కల్యాణ్ హత్యకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కుట్ర చేశారని కొన్ని రోజులుగా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ హత్యకు 250 కోట్ల రూపాయలతో సుపారీ ఇచ్చారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఆగస్టు 19న కడప జిల్లా సిద్ధవటంలో చంపడానికి ప్రయత్నించారని.. సిద్ధవటం రైతు భరోసా సభలో కిరాయి హంతకులు సంచరించినట్లు  నిఘా వర్గాలు తెలిపాయని ఓ జాతీయ పత్రికలో కథనం వచ్చింది. పవన్ కాన్వయ్‌లోకి గుర్తు తెలియని వాహనం ప్రవేశించేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ హెచ్చరించడంతో అ వాహనం వెళ్లిపోయిందని తెలిపింది. పవన్ హత్య ప్లాన్‌కి అప్పుడు అలా బ్రేక్ పడిందని.. ఇప్పుడు ఏకంగా పవన్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించేందుకే సిద్ధమవడం కలకలం రేపుతోందని ఆ కథనంలో తెలిపింది.


మరోవైపు జనసేన అధినేత హత్యకు కుట్ర జరుగుతోందన్న వార్తలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు  ఈ కేసును సీరియస్‌గా తీసుకొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు చేతకాకపోతే కేంద్రం విచారణ చేయిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం సరికాదన్నారు. ఏపీలో జనసేన పార్టీతో కలిసే బీజేపీ ఎన్నికలకు వెళ్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook