వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసులో( ycp leader murder ) టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్రంలో సంచలనం రేపిన  మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మోకా భాస్కర్ రావు హత్యకేసులో( Moka Bhaskarrao murder case) పట్టుబడిన నిందితుల వాంగ్మూలం మేరకే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టు చోటుచేసుకుంది. అసలు నిందితులిచ్చిన వాంగ్మూలమేంటి..హత్యకు కారణాలేంటి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


వైసీపీ నేత మోకా భాస్కర్ రావు జూన్ 29 వ తేదీన హత్యకు గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ హత్యకేసు విచారణను పోలీసులు త్వరగానే చేధించారు. ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు మరో ముందడుగేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర  ప్రోద్భలంతోనే తామీ హత్యకు పాల్పడినట్టు నిందితులు స్పష్టం చేయడం సంచలనం రేపింది. దాంతో  రంగంలో దిగిన పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కోసం గాలింపు చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో రవీంద్రను అరెస్టు చేసి...కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. న్యాయస్థానం కొల్లు రవీంద్రకు ( Kollu Ravindra ) 14 రోజుల రిమాండ్ విధించడంతో..రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. Also read: AP: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ లాక్ 2: సడలింపులు ఇవే


పోలీసుల విచారణలో ఈ హత్యకేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి రవీంద్రకు అత్యంత సన్నిహితుడైన చింతా చిన్ని, రవీంద్ర పీఏ, రవీంద్ర మధ్యన.. మోకా భాస్కర్ రావు హత్య జరిగినప్పటి నుంచి వరుస ఫోన్ లు ఒకరి నుంచి మరొకరికి వెళ్లినట్టు పోలీసుల విచారణలో నిర్ధారణైంది. అటు అరెస్టైన నిందితులు కూడా  కొల్లు రవీంద్ర ప్రోద్భలం మేరకే హత్య చేసినట్టు వాంగ్మూలం  ఇవ్వడంతో  కేసులో నాలుగే నిందితుడిగా రవీంద్రను చేర్చారు. గత కొద్దికాలంగా మాజీ మంత్రి రవీంద్రపై  హతుడు మోకా భాస్కర్ రావు  తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ ఆధిపత్యపోరు కారణంగానే మోకా భాస్కరరావు హత్య జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ సైతం స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో మోకా హత్యకు పలుసార్లు ప్రయత్నం కూడా జరిగిందని ఎస్పీ చెప్పడం గమనార్హం.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..