AP Exit Poll Results 2024:తాజాగా ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు  ఎన్నికలు జరిగాయి. నిన్నటితో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తై ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలుబడ్డాయి. అందులో మెజారిటీ సర్వేలు.. ఏపీలో తెలుగు దేశం కూటమిదే అధికారం అంటున్నాయి. కొన్ని సర్వేలు మాత్రం వైసీపీకే ప్రజలు తిరిగి పట్టం కట్టబోతున్నట్టు చెబుతున్నాయి. అయినా.. అందులో మెజారిటీ మంత్రులు ఈ సారి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సారి వైయస్ఆర్సీపీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. ఈ సారి నగరి నుంచి ఓడిపోవడం ఖాయం అంటున్నాయ. వైసీపీ గెలుస్తుందన్న ఆరా వంటి సంస్థలు కూడా రోజా హాట్రిక్ కొట్టడం డౌటే అంటున్నాయి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా.. రెండు సార్లు ఓటమి పాలై మూడో సారి  2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా తిరిగి నగరి నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ ఈ సారి ఎన్నికల్లో తన సమీప తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలు కావడం ఖాయం అంటున్నాయి సర్వే సంస్థలు.


ఇక వైసీపీకి చెందిన మరో మంత్రి అంబటి రాంబాబు ఈ సారి సత్తెనపల్లిలో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి కన్నా లక్ష్మీ నారాయణ చేతిలో ఓటమి పాలు కావడం ఖాయం అంటున్నారు. గత ఎన్నికల్లో ఈయన కోడెల శివ ప్రసాద్ ను ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలవడంతో ఆ నియోజకవర్గంలో సమీకరణాలు మారాయి. దీంతో ఈ సారి అంబటి ఎమ్మెల్యేగా గెలవకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి.


అటు వైయస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఈ సారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పరాభవం తప్పదని సర్వేలు చెబుతున్నాయి. 2004 నుంచి వరుసగా కొడాలి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2004, 2009లో తెలుగు దేశం తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో మాత్రం వైయస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నానికి ఈ సారి కూటమి నుంచి వెనిగండ్ల రాము చేతుల్లో ఓడిపోవడం ఖాయం అంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. వీరితో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన చాలా మంది మంత్రులు ఈ సారి ఎన్నికల్లో పరాభవం తప్పదని సర్వేలు ఘోషిస్తున్నాయి. మరి మెజారిటీ సర్వేలు చెబుతున్నట్టు వీళ్లకు ఈ ఎన్నికల్లో గెలుపు అంతా ఈజీ కాదనే భావన వ్యక్తం అవుతోంది. మొత్తంగా ఈ సర్వేలు చెబుతున్నవి నిజం అవుతాయా లేదా అనేది తెలియాలంటే జూన్ 4న జరిగే కౌంటింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Also Read: Telangana Lok Sabha: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. కాంగ్రెస్‌కు బీజేపీ షాక్‌.. కారు షెడ్డుకే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook