AP Fibernet Case: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. స్కిల్ కేసులో బెయిల్ వచ్చిందనే ఆనందం నుంచి తేరుకునేలోగా ఫైబర్‌నెట్ కేసు చుట్టుముడుతోంది. ఈ కేసులో ఇవాళ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం ఇందుకు ఉదాహరణ. ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణంలో ఇవాళ జరిగిన పరిణామం చంద్రబాబు మెడకు చుట్టుకోనుందా అనే సందేహాలు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో ఇవాళ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ25గా ఉన్న ఈ కేసులో 114 కోట్లు దుర్వినియోగమయ్యాయనేది సీఐడీ అభియోగం. ఇందులో ఏ1గా వేమూరి హరికృష్ణ, ఏ2గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, ఏ25గా చంద్రబాబు ఉన్నారు. ఈ కేసులో ఏడుగురు నిందితులకు చెందిన 114 కోట్ల ఆస్థుల్ని జప్తు చేసేందుకు సీఐడీ ఏసీబీ కోర్టు అనుమతి కోరింది. ఇవాళ ఈ కేసులో ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడుగురు నిందితులకు చెందిన 114 కోట్ల ఆస్థుల్ని జప్తు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై ఉన్న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్న మంగళూరులోని ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాల్ని సీఐడీ జప్తు చేయనుంది. 


నెటాప్స్, ఫైబర్ సొల్యూషన్ డైరెక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకు చెందిన గుంటూరు, విశాఖపట్నం కిర్లంపూడి లే అవుట్‌లోని ఇళ్లు జప్తు చేయనుంది.


అంటే గుంటూరులో ఓ ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లో నాలుగు ఫ్లాట్లు, తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఏపీ సీఐడీ జప్తు చేసే జాబితాలో ఉన్నాయి. 


Also read: Chandrababu Case: చంద్రబాబు బెయిల్‌పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook