AP Floods: రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గత పదిరోజుల నుంచి వానలు పడటం లేదు. ఐతే ఇప్పుడు మరో ఉపద్రవం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఈక్రమంలో గోదావరి, కృష్ణా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఈనేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో, ఔట్ ఫ్లో 14.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో మొత్తం 3 ఎస్డీఆర్ఎఫ్‌, 3 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఎన్డీఆర్ఎఫ్‌, ఐయినవిల్లి, మామిడికుదురులో ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలను మోహరించారు. 


అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్డీఆర్ఎఫ్‌, వీఆర్ పురంలో ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలను దించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎన్డీఆర్ఎఫ్‌ బృందాన్ని మోహరించారు. మరోవైపు కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. జూరాల, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద నీరు ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‌ ఫ్లో, ఔట్ ఫ్లో అంతకంతకూ పెరుగుతోంది. వంశధార-నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 


గొట్టా బ్యారేజ్‌ వద్ద ఔట్ ఫ్లో 30 వేల 712 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో వరద ప్రవాహం తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈమేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈనెల 19న ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 19, 20 తేదీల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయని..రాయలసీమలో ఒకటి రెండు చోట తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 


ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడకక్కడ తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఐతే ఈనెల 19న ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండబోదని చెబుతున్నారు. ఐనా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. తీర ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తీరం వెంట పెను గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.


Also read:Revanth Reddy: రేవంత్ రెడ్డితో ఉండలేం.. కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత రాజీనామా?


Also read:Munugode ByPoll Live Updates: కోమటిరెడ్డితో పాటు బీజేపీలోకి మరో సీనియర్ నేత.. ఈనెల 21న మునుగోడుకు అమిత్ షా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook