ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో ఈ నెల 16న కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ అనంతరం జరుగుతున్న విచారణ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మార్చ్ నెలలో వైఎస్ వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసు ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసు తదుపరి విచారణ తెలంగాణ హైకోర్టులో జస్టిస్ సుమలత ధర్మాసనంలో ఈ నెల 16 వతేదీన జరగనుంది. ఈ క్రమంలో తొలిసారిగా కేసులోని నిందితులంతా హాజరుకానున్నారు. కడప జైలు నుంచి చంచల్ గూడ జైలుకు నిందితుల్ని తరలించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసుతో తనకు సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ కేసులో ఏ2గా ఉన్న వై సునీల్ యాదవ్ పిటీషన్ దాఖలు చేశాడు. 


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ అయిన తరువాత కీలక పరిణామాలు సంభవించాయి. ఈ కేసులో ముందు నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు గంటలపాటు విచారించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రాంసింగ్ బృందం అవినాష్ రెడ్డిని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. కొంతమంది దర్యాప్తును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నందున..తాను వెల్లడించే విషయాలు వక్రీకరించకూడదనే ఉద్దేశ్యంతో న్యాయవాది సమక్షంలో వీడియా రికార్డింగ్‌తో విచారణ జరిపించాలని అవినాష్ రెడ్డి కోరినా..సీబీఐ అధికారులు అంగీకరించలేదు. ఈ కేసులో అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారని..సీబీఐ విచారణకు సహకరిస్తానని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. 


అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించిన అనంతరం జరుగుతున్నది కావడంతో ఈనెల 16వ తేదీ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. 


Also read: Delhi liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవరెడ్డి పాత్ర కీలకమా, పెద్దల అరెస్టు ఖాయమేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook