AP: సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ పారంభం
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో స్కూళ్ల ప్రారంభం అదే రోజు ప్రారంభం కానుంది. ముందుగా అనుకున్న తేదీకే స్కూల్స్ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక జగనన్న విద్యాకానుక కూడా అదే రోజు ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో స్కూళ్ల ప్రారంభం అదే రోజు ప్రారంభం కానుంది. ముందుగా అనుకున్న తేదీకే స్కూల్స్ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక జగనన్న విద్యాకానుక కూడా అదే రోజు ప్రారంభించనున్నారు.
ఓ వైపు కరోనాను ( Corona ) కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు జన జీవనాన్ని తిరిగి గాడిలో తెచ్చే ప్రతి ప్రయత్నం ఏపీలో కొనసాగుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్ని ( Covid19 tests ) భారీగా నిర్వహిస్తూనే ప్రజా సంక్షేమ పధకాలను అడ్డంకి లేకుండా కొనసాగిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు ముందుగా అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 5 నుంచే స్కూల్స్ ( Schools will re open from september 5th in ap ) ప్రారంభించనుంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( Ap Education minister Suresh ) ప్రకటించారు. నాడు నేడు కార్యక్రమంంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) సమీక్షలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల నుంచి నాడు నేడు ఫేజ్ 2 ను ప్రారంభించనున్నామని మంత్రి సురేశ్ తెలిపారు.
మరోవైపు ఏపీలో స్కూళ్లను సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించడానికి ( Ap schools from 5th september ) అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ( Minister Adimoolapu suresh ) చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు తెరవడానికి రాష్ట్రాల సంసిద్ధతను వెల్లడించాల్సిందిగా గతంలో కేంద్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరవడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపింది. ముందుగా అనుకున్న తేదీకే స్కూల్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని...అదే రోజు జగనన్న విద్యాకానుక నిర్వహించనున్నట్టు చెప్పారు. Also read: AP Corona Update: లక్షన్నర దాటిన కేసులు
స్కూల్స్ కు వెళ్లే విద్యార్ధులకు మాస్క్, బుక్స్, స్కూల్ యూనిఫారమ్, బ్యాగ్స్ ఉండేలా చర్యలు తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. కరోనా నేపధ్యంలో గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ ను ప్రారంభిస్తామన్నారు. Also read: Zero Size: ఇంతకీ ఈమెకు నడుము ఉందా లేదా అసలు