Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన పాఠశాలలు తిరిగి తెర్చుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో స్కూల్ల్స్ రీ ఓపెనింగ్‌కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతకు ముందే వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) కారణంగా ఏపీలో స్కూల్స్ , కళాశాలలు మూతపడి ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో స్కూల్స్ తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15 తరువాత రాష్ట్రంలో పాఠశాలలు తెరిచేందుకు (Ap Schools Reopen) ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో ఆగస్టు 15 లోగా టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. అదే నెలలో విద్యా కానుక, నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభం కావాలన్నారు. తొలి విడత నాడు-నేడులో పనులు పూర్తయిన పాఠశాలల్ని ప్రజలకు అంకితం చేయనున్నారు.


ఆగస్టులోగా విద్యాసంస్థల్లో నాడు-నేడు(Nadu-Nedu)పెండింగ్ పనులు పూర్తి చేయాలని వైఎస్ జగన్ (Ap cm ys jagan) కోరారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకూ వర్క్ బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ అందించాలన్నారు. నాడు-నేడు కింద పనుల కోసం 16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని జగన్ ఆదేశించారు. మరోవైపు నూతన విద్యా విధానం అమలుకు తీసుకోవల్సిన చర్యలపై జగన్ సమీక్షించారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య విద్యావంతులైన నైపుణ్యం కలిగిన సిబ్బందితో బోధన ఉండాలన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్‌ను మూసివేయడం గానీ, టీచర్లను తొలగించడం గానీ చేయకూడదన్నారు. 


Also read: Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఇవాళ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook