AP CPS Issue: మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, సీపీఎస్‌పై కమిటీ
AP CPS Issue: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. స్థూలంగా చెప్పుకోవాలంటే సీపీఎస్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో ఒకటి. ఇప్పుడీ హామీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP CPS Issue: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. స్థూలంగా చెప్పుకోవాలంటే సీపీఎస్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో ఒకటి. ఇప్పుడీ హామీ నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాం నుంచి ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనల్లో ప్రధానమైంది సీపీఎస్ రద్దు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం రద్దు చేయాలంటూ గత ప్రభుత్వ హయాంలో చాలా ఆందోళనలు జరిగాయి. 2019 ఎన్నికల హామీల్లో భాగంగా నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్..సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తోంది. కానీ సీపీఎస్ రద్దు విషయం మాత్రం ఇంకా ఆచరణలో రాలేదు. సాంకేతికంగా ఇబ్బందికర వ్యవహారం కావడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
మరోవైపు సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు మరోసారి ఉద్యమబాట పట్టాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని గుర్తు చేశాయి. ఫలితంగా సీపీఎస్ రద్దు విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సీపీఎస్ రద్దు విషయంలో కొత్తగా కమిటీ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఐదుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. కమిటీలో ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ , బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఉంటారు. మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా ఇదే విషయమై సమావేశాలు జరుపుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో చర్చలు జరిగాయి. సీపీఎస్ రద్దు సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలపై చర్చించిన అనంతరం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి..ఆ తరువాత తుది నివేదికను ప్రభుత్వానికి అందిస్తారు.
Also read: AP Teachers Protest: సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల ఆందోళనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.