విజయవాడ స్వర్ణ ప్యాలేస్ ( Vijayawada Swarna palace ) అగ్నిప్రమాదం నేపధ్యంలో కోవిడ్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం నిఘా పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నవాటిపై చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొన్ని కోవిడ్ సెంటర్ల ( Covid centres ) అనుమతుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


విజయవాడ స్వర్ణ ప్యాలేస్ హోటల్ లో రమేష్ ఆసుపత్రి ( Ramesh hospital ) నిర్వహిస్తున్న  కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ఏపీ ప్రభుత్వం ( Ap Government ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ సెంటర్లపై నిఘా పెంచింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నవాటిపై చర్యలకు దిగుతోంది. సరైన సదుపాయాలు లేనివాటిపై, రోగుల్నించి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నవాటిపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ చర్యల్లో భాగంగా ఒక్క విజయవాడలోనే ఐదు కోవిడ్ సెంటర్ల అనుమతుల్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ రద్దు చేసింది. వీటిలో రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ ప్యాలేస్ ( Swarna palace ), డాక్టర్ లక్ష్మీ నర్శింగ్ హోమ్ ఆధ్వర్యంలోని హోటల్ అక్షయ ( Hotel Akshaya ), ఇండో బ్రిటీష్ ఆసుపత్రికి చెందిన హోటల్ ఐరా ( Hotal Ira ), ఎన్ ఆర్ ఐ హీలింగ్ హ్యాండ్స్, ఆంధ్రా హాస్పటల్స్ కు చెందిన సన్ సిటీ ( Sun city ), కృష్ణమార్గ ( krishna marg ) కోవిడ్ సెంటర్ల అనుమతుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కోవిడ్ సెంటర్లపై రోగుల నుంచి ఫిర్యాదులు అందినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 


సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే స్వర్ణ ప్యాలేస్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిందని విచారణ తేలింది. ఆసుపత్రుల్లో వరుస ప్రమాదాల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. Also read: Kollu Ravindra: సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి విడుదల