వైఎస్సార్‌సీపీ నేత, రవాణా, సమాచార శాఖల మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్ రావు (Moka Bhaskar Rao Murder) హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) జైలు నుంచి విడుదలయ్యారు. మోకా భాస్కరావు హత్య కేసులో ఏ4గా ఉన్న కొల్లు రవీంద్రకు నిన్న సాయంత్రం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత 53 రోజులుగా జైల్లోనే ఉన్న కొల్లు రవీంద్ర బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి (Kollu Ravindra released from Jail) విడుదలయ్యారు. COVID19 Deaths In India: భారత్‌లో 87శాతం కరోనా మరణాలు ఆ వయసు వారిలోనే..
కాగా, జూన్ నెలలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కర్ రావు దారుణ హత్యకు గురవడం తెలిసిందే. రాజకీయ కక్షల కారణాలతో భాస్కర్ రావును హత్య చేయించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డుకు చైర్మన్‌గా భాస్కర్ రావు పనిచేశారు. SP Balu Health Update: చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్