Dussehra Holidays: ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు, ఎప్పట్నించంటే
Dussehra Holidays: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. ఏకంగా 13 రోజులపాటు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Dussehra Holidays: ఏపీలో విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వం ఈసారి పిల్లలకు పెద్దఎత్తున దసరా సెలవుల్ని అందిస్తోంది. ఎస్ఏ1 పరీక్షల అనంతరం విద్యాలయాలకు సెలవులు ప్రకటించేసింది. ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పట్నించి ఎప్పటి వరకో తెలుసుకుందాం..
ఏపీలో దసరా సెలవులు ఈసారి ముందుగానే ప్రకటించేసింది ప్రభుత్వం. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకూ ఏకంగా 13 రోజులపాటు దసరా సెలవుల్ని ఇచ్చింది. ఈ సెలవులకు సంబంధించి షెడ్యూల్ కూడా అధికారులు విడుదల చేశారు. సెలవుల కంటే ముందుగా ఎస్ఏ 1 పరీక్షల నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ పరీక్షలను అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. గత ఏడాది అమలు చేసిన సరి, బేసి విధానం కాకుండా..ఉదయం సమయంలో నిర్వహించనున్నారు. 8వ తరగతి పరీక్షలు మాత్రం విడిగా ఉంటాయి.
ఇంతకుముందు 6,8, 10 తరగతులకు ఉదయం, 7,9 తరగతులకు మద్యాహ్నం పరీక్షలు జరిగేవి. ఈసారి అలా కాదు. 8 వతరగతి మినహాయించి మిగిలిన తరగతులకు ఉదయం వేళ పరీక్షల జరగనున్నాయి. అక్టోబర్ 5 నుంచి 11 వరకూ ఎస్ఏ 1 పరీక్షలు ముగిశాక ఒకరోజు విరామం ఉంటుంది. ఆ తరువాత అక్టోబర్ 13 నుంచి 25 వరకూ దసరా సెలవులుంటాయి. 26వ తేదీన తిరిగి స్కూళ్లు తెర్చుకుంటాయి.
అక్టోబర్ 22వ తేదీన దుర్గాష్టమి అంటే పెద్ద బతుకమ్మ పండుగ ఉంటుంది. 24వ తేదీన విజయ దశమి ఉంది. ఈసారి దసరా, బతుకమ్మ కలిపి 13 రోజులపాటు సెలవులున్నాయి. తెలంగాణలో కూడా ఇదే సమయంలో సెలవులున్నాయి.
Also read: YS Jagan: విజయదశమికి జగన్ ఛలో విశాఖ, 23న కొత్త ఇంటి గృహ ప్రవేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook