Caveat Petition: చంద్రబాబు కేసులో ఏపీ ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తాజాగా ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. కేవియట్ ద్వారా ప్రభుత్వం ఏం చెప్పదల్చుకుంది, చంద్రబాబుకు వచ్చే ఇబ్బుందులేంటనేది పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కిల్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తన రిమాండ్ అక్రమమని కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్లను ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కొట్టివేశాయి. దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టులో అక్టోబర్ 3వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చేముందు తమ వాదన వినాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. 


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని, విద్యార్ధులకు శిక్షణ ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయల స్కాంకు పాల్పడ్డారని ప్రభుత్వం తెలిపింది. నిధుల్ని షెల్ కంపెనీల ద్వారా మళ్లించి క్యాష్ చేసుకున్నారని వెల్లడించింది. ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని, మొదటగా దీనిపై సమాచారమిచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ అని ప్రభుత్వం స్ఫష్టం చేసింది. 


సెక్షన్ 148 ఏ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం న్యాయస్థానంలో కేవియట్ పిటీషన్ దాఖలు చేసేందుకు అవకాశముంటుంది. కేవియట్ పిటీషన్ దాఖలు చేసేపార్టీ అవతలి పార్టీకు నోటీసు ఇచ్చి కోర్టు ముందు హాజరుకావల్సి ఉంటుంది. కేవియట్ పిటీషన్ వ్యవధి 90 రోజులుంటుంది. 


చంద్రబాబుపై స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్లు ఘర్షణల కేసులు ఉన్నాయి. ఇప్పుడు క్వాష్ కేసులో ప్రభుత్వం కేవియట్ పిటీషన్ దాఖలు చేయడం చంద్రబాబుకు మరింత ఇబ్బంది కల్గించే పరిణామమే ఇది.


Also read: Ys jagan-Adani: సీఎం జగన్‌తో భేటీ అయిన గౌతమ్ అదానీ, రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook