AP PRC: ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి ముందు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పీఆర్​సీ పై జగన్ సర్కార్ ఎట్టకేలకు ప్రకటన (CM Jagan announced PRC) చేసింది. 23.29 శాతం ఫిట్​మెంట్ ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసింది. ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది (Retirement age in AP) ఏపీ ప్రభుత్వం.


కొత్త పీఆర్​సీ 2020 ఏప్రిల్​ నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. ఇక ఉద్యోగులకు పెరిగిన వేతనాలు ఈ ఏడాది జనవరి 1 నుంచే వర్తిస్తాయని (Salary hike for govt employees) స్పష్టం చేసింది ప్రభుత్వం. పెండింగ్​లో ఉన్న డీఏలు కూడా జనవరి నుంచే చెల్లించనున్నట్లు వివరించింది. కొత్త పీఆర్​సీతో ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడనుందని ప్రభుత్వం పేర్కొంది.


ఉద్యోగులకు మరిన్ని మరిన్ని ఆఫర్లు..


సొంతిళ్లు లేని ప్రభుత్వం ఉద్యోగులకు.. జగనన్న స్మార్ట్ టౌన్​షిప్స్​లో 10 శాతం రిజర్వ్​ చేయయనున్నట్లు ప్రభుత్వం (AP government offers to employees) ప్రకటించింది. దీనితోపాటు 20 శాతం రిబేటు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం ఉద్యోగులందరికీ సొంతిళ్లు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చింది.


ఉద్యోగుల డిమాండ్స్​ ఇలా..


71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. దీనిపై సీఎస్‌, ఇతర అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించపోవడంతో నేరుగా సీఎంతో చర్చలు జరిపాయి ఉద్యోగ సంఘాలు.


పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్‌ వంటివి ఉద్యోగ సంఘాల డిమాండ్లల ప్రధానంగా ఉన్నాయి.


తమకు 55 శాతం ఫిట్‌మెంట్‌ (AP Employees Unions Demands) ఇస్తేనే ఆమోదయోగ్యంగా ఉంటుందని కూడా ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 14.29 శాతానికి అంగీకరించాలని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ ఉద్యోగులు వెనక్కితగ్గలేదు.


అయితే ఉద్యోగ సంఘాల డిమాండ్లు ప్రభుత్వానికి మోయలేని భారంగా మారుతాయని ప్రభుత్వం అభిప్రాయడింది. దీనిపై చర్చోపచర్చల తర్వాత 23.29 శాతం ఫిట్​మెంట్​కు ప్రభుత్వం (Fitment for AP govt employees) ఆమోదం తెలిపింది.


Also read: Kodali Nani: వైసీపీ సంచలన నిర్ణయం.. ఆ మీడియా సంస్థలపై నిషేధం...


Also read: GO No.2 Withdraw: సర్పంచులకు గుడ్ న్యూస్.. జీవో నం.2ను వెనక్కి తీసుకున్న ఏపీ సర్కారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook