Kodali Nani: వైసీపీ సంచలన నిర్ణయం.. ఆ మీడియా సంస్థలపై నిషేధం...

YSRCP bans these Media Channels:  ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. ఇకపై కొన్ని మీడియా సంస్థలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆ జాబితాలో ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5 న్యూస్ ఛానెల్స్ ఉన్నట్లు తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 08:15 PM IST
  • మంత్రి కొడాలి నాని సంచలన ప్రకటన
  • ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5లపై నిషేధం
  • ఇకపై వైసీపీ కార్యక్రమాలకు ఈ ఛానెల్స్‌ను దూరం పెట్టాలని నిర్ణయం
Kodali Nani: వైసీపీ సంచలన నిర్ణయం.. ఆ మీడియా సంస్థలపై నిషేధం...

YSRCP bans these Media Channels: ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు. ఇకపై కొన్ని మీడియా సంస్థలను వైసీపీ పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆ జాబితాలో ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5 న్యూస్ ఛానెల్స్ ఉన్నట్లు తెలిపారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందునా ఈ మీడియా సంస్థలను నిషేధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటినుంచి పార్టీ తరుపున జరిగే సమావేశాలకు ఈ మీడియా సంస్థలకు ఆహ్వానం ఉండదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ ఈ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని... ప్రెస్ మీట్స్‌కి పిలవొద్దని పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు.
 

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చెప్పే శ్రీరంగ నీతుల్లో నిజమెంతో అబద్దమెంతో తెలుసుకోకుండా ఈ ఛానెల్స్ అదే పనిగా ప్రచారం చేస్తున్నాయని కొడాలి నాని ఆరోపించారు. అందుకే ఈ ఛానెల్స్‌ను వైసీపీ శ్రేణులు దూరం పెట్టాలన్నారు. చంద్రబాబు, ఆయన తరుపు మీడియా ఎంత ప్రయత్నించినా సీఎం జగన్ తలపెట్టిన మహా యజ్ఞాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాష్ట్రంలో రాబోయే 30 ఏళ్లు జగనే అధికారంలో ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ జగన్ ముందుకెళ్తున్నారని చెప్పారు.

2024లో అధికారంలోకి వస్తామని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని కొడాలి నాని (Kodali Nani) విమర్శించారు. 'నీకు జీవిత కాలం టైమ్ ఇస్తున్నా... జగన్మోహన్ రెడ్డిని దింపి నువ్వు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్లిపోతా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని (YS Jagan) అధికారం నుంచి దింపకపోతే హైదరాబాద్‌కే పరిమితమవుతావా...' అని కొడాలి నాని చంద్రబాబుకు సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు తానే నిర్మించినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని... అవి రెండు వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన చేశారని చెప్పారు. రోశయ్య హయాంలో రింగ్ రోడ్డు పూర్తయిందన్నారు. ఒకవేళ చంద్రబాబు హయాంలోనే ఈ రెండు నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని మరో సవాల్ విసిరారు.

Also Read: CM Jagan on PRC: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన- సీఎం జగన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News