DSC Notification: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, సంక్రాంతి పండుగ తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమౌంది. ఈ విషయాన్ని స్వయంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఎన్ని పోస్టులుంటాయి, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారనే వివరాలతో నోటిఫికేషన్ ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చర్చించామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మెగా డీఎస్సీలో ఎన్ని పోస్టులుంటాయి, ఉద్యోగాల భర్తీ విధి విధానాలు త్వరలో వెల్లడి కానున్నాయి. చాలాకాలంగా డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్ధులు నిరాశతో ఉన్నారు. ఈ నోటిఫికేషన్‌లో భారీగా అంటే10 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మార్చ్ నాటికి డీఎస్పీ రిక్రూట్‌మెంట్ పూర్తయ్యేలా షెడ్యూల్ ఉండవచ్చని సమాచారం. మరోపు గ్రూప్ 2 దరఖాస్తుల గడువు తేదీని ఏపీ ప్రభుత్వం జనవరి 17 వరకూ పొడిగించింది. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఇబ్బందులు ఎదుర్కోవడంతో గడువు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా 897 పోస్టులు భర్తీ కానున్నాయి. 


Also read: TDP-Janasena Manifesto: టీడీపీ-జనసేన మేనిఫెస్టో సిద్ధం, ఇవే ముఖ్యమైన 12 అంశాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook