Oxygen Committee: కరోనా మహమ్మారి ఉధృతంగా విస్తరిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆక్సిజన్ నిరంతర సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆక్సిజన్ పర్యవేక్షణకు పర్యవేక్షణ కమిటీని నియమించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)అతి భయంకరంగా విస్తరిస్తోంది. వరుసగా నాలుగవరోజు కూడా దేశంలో 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కట్టడికి ఏపీ ప్రభుత్వం వివిధ మార్గాల్లో చర్యలు తీసుకుంటోంది. కరోనా నిర్ధారణ పరీక్షల(Covid19 Tests) సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచింది. ప్రతిరోజూ లక్షకు పైగా పరీక్షలు నిర్వహిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 21 వేల కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత (Oxygen Shortage) రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.


ఈ సమయంలో ఆక్సిజన్ చాలా కీలకమైన ప్రత్యామ్నాయంగా మారింది. ఆక్సిజన్ సరఫరా(Oxygen Supply)ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు 9 మంది సభ్యులతో మానిటరింగ్ కమిటీ ( Oxygen Monitoring Committee)ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆక్సిజన్ ఎంత కావాలి, భవిష్యత్ అవసరాలకు ఎంత అవసరమనే అంశాల్ని పరిశీలించడంతో పాటు ఎలాంటి అంతరాయం లేకుండా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా కమిటీ చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ ధాస్ వివరాలు అందించారు. కమిటీలో ఐఏఎస్ అధికారులు ఢిల్లీ రావు, రాజాబాబుతో పాటు పరిశ్రమల శాఖకు చెందిన డీడీ ఎం సుధాకర్ బాబు, ముగ్గురు కన్సల్టెంట్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అవినాష్ రెడ్డి, రవాణా శాఖ తరపున ఆర్టీఏ పుమేంద్ర, ఎంవీఐ ప్రవీణ్‌లు ఉంటారు. కమిటీ సభ్యులు ప్రత్యేక అధికారి షాన్ మోహన్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.


Also read: The Lancet Report: కళ్లు తెరవకపోతే పెను ముప్పే..లాన్సెట్ తీవ్ర హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook