Corona Third Wave: కరోనా మహమ్మారి దేశాన్ని ఇప్పట్లో వదిలే పరిస్థితులు కన్పించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ నుంచి తేరుకునేలోగా..థర్డ్‌వేవ్ ముప్పు ఆందోళన కల్గిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ విషయంలో ఢిల్లీ ఐఐటీ నివేదిక ఏం చెబుతోంది.
Temple Covid Care Centres: కరోనా రోగుల కోసం ఏపీ ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దేవాలయాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. మొత్తం వేయి పడకలు సిద్ధమయ్యాయి.
Oxygen plants: ఏపీ ప్రభుత్వం ఆక్సిజన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసం భారీగా నిధుల్ని కేటాయించింది.
Oxygen Committee: కరోనా మహమ్మారి ఉధృతంగా విస్తరిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆక్సిజన్ నిరంతర సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆక్సిజన్ పర్యవేక్షణకు పర్యవేక్షణ కమిటీని నియమించింది.
IMA calls for nation wide lockdown: న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో పాటు వైద్య సదుపాయాలు, ఆక్సీజన్ కొరత, బెడ్స్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం కనిపిస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు ఓ లేఖ రాసింది.
Telangana CM KCR about lockdown in Telangana state: హైదరాబాద్: తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. అంతకంటే ముందుగా ప్రధాని మోదీతో మాట్లాడిన సీఎం కేసీఆర్... రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు (remdesivir injections), ఆక్సీజన్ సప్లై (Oxygen supply) విషయంలోనే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
Oxygen Tankers: దేశంలో కరోనా మహమ్మారి తారాస్థాయిలో విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరిగే కొద్దీ దేశంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. ఆక్సిజన్ లేక విలవిల్లాడుతున్న దేశానికి విదేశాల్నించి ఆక్సిజన్ అందుతోంది.
Oxygen Tanker: ప్రాణవాయువు విలువ తెలుస్తోంది. ఆక్సిజన్ లేక కరోనా రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే విలవిల్లాడుతోంది. సమయానికి ఆ ఆక్సిజన్ ట్యాంకర్ రాకుంటే..వందకు పైగా ప్రాణాలు కాలిలో కలిసేవి.
Oxygen to India: కరోనా మహమ్మారి దేశంలో తీవ్రంగా విజృంభిస్తోంది. వరుసగా మూడవ రోజు దేశంలో 3.5 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రం కావడంతో సింగపూర్, సౌదీ అరేబియా దేశాల్ని భారీగా సహాయం అందుతోంది.
Delhi HC on Oxygen supply: న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. అనేక చోట్ల ఆక్సీజన్ కొరత కారణంగా కరోనా రోగుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. మరోవైపు ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రాలకు వాటికి సమీపంలోని అక్సీజన్ ప్లాంట్స్ నుంచి ఆక్సీజన్ కేటాయింపులు జరిపింది.
Oxygen Shortage: కరోనా మహమ్మారి మృత్యుఘోష కొనసాగుతోంది. ప్రాణవాయువు అందక రోగులు ప్రాణాలు పోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇదే పరిస్థితి. ఆక్సిజన్ అందక ఏకంగా 20 మంది రోగుల ప్రాణాలు గాలిలో కల్సిపోయాయి.
IAF planes airlifted oxygen tankers: హైదరాబాద్: తెలంగాణలో ఆక్సీజన్ కొరతను అధిగమించేందుకు యుద్ధ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్స్‌ని ఒడిశాకు పంపించారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరుకున్నాయి. భువనేశ్వర్ నుంచి విమానాల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ని (Liquid medical oxygen) రాష్ట్రానికి తీసుకురానున్నారు.
Oxygen Availability: కరోనా మహమ్మారి ఉధృతి నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్ లభ్యతపై మంత్రి గౌతమ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఏపీ అవసరాల తరువాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
Oxygen Supply: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరోవైపు తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ప్రత్యామ్నయంగా ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్నించి అవసరమైన లిక్విడ్ ఆక్సిజన్ రప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.