Amaravati Capital Works: అమరావతి పనులు ప్రారంభం, 2027కు పూర్తి కానున్న రాజధాని
Amaravati Capital Works: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మళ్లీ సిద్ధమౌతోంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయినా జరగని అమరావతి అభివృద్ధి పనులు కొత్త ఏడాదిలో పుంజుకోవచ్చని తెలుస్తోంది. ఇప్పుడైనా అమరావతి దశ మారవచ్చని తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
Amaravati Capital Works: ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణం పట్టాలెక్కుతోంది. మూడేళ్ల వ్యవధిలో క్యాపిటల్ సిటీ రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మౌళిక సదుపాయల కల్పనకై ఏపీ ప్రభుత్వం ఈ టెండర్ల ప్రక్రియ మొదలెట్టింది. ప్రధాని మోదీతో చర్చించిన చంద్రబాబు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం అత్యంత ఖరీదుగా మారనుంది. ఏకంగా 60 వేల కోట్ల రూపాయల అంచనాలతో తొలిదశ పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధాని ప్రాంతంలో మౌళిక సదుపాయల కల్పనకు ఈ టెండర్లు ఆహ్వానించింది. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆర్ధిక సహకారంతో ఈ పనులు ప్రారంభించనుంది. ఈ మేరకు కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. హ్యాపీ నెస్ట్ నిర్మాణం కోసం సీఆర్డీఏ 818 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచింది. ఇందులో జీ ప్లస్ 18 విధానంలో 12 టవర్ల నిర్మాణం జరుగుతుంది. 20 లక్షల 89 వేల 260 చదరపు అడుగుల్లో మొత్తం 1200 ప్లాట్లు ఉంటాయి. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును నేలపాడులో నిర్మించదలిచారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలో 1206 కోట్లతో మౌళిక సదుపాయల కల్పనకు ఈ టెండర్లు పిలిచింది ప్రభుత్వం. ఇందులో జోన్ 5బి పరిధిలో 603 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రెయిన్స్, తాగునీటి సరఫరా, సీవరేజ్ వ్యవస్థ, ప్లాంటేషన్ పనులను తుళ్లూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రాయపూడి గ్రామాల్లో చేపడతారు. ఇక వరద నీటి నిర్వహణకై 1585.96 కోట్లు కేటాయించారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ పనులకు టెండర్లు పిలవనున్నారు. ఈనెల 21 సాయంత్రం 4 గంటల వరకూ ఈ టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 2027 డిసెంబర్ నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం 30 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తోంది.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా మౌళిక సదుపాయాలన కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, జీవన ప్రమాణాలు ప్రణాళికాబద్ధంగా కల్పించనున్నారు.
Also read: DA Announcement: ఉద్యోగులకు సంక్రాంతి కానుక, రెండు డీఏల ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.