యూకే  కరోనా స్ట్రెయిన్ సంక్రమణను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. సంక్రాంతి పండుగ నేపధ్యంలో జాగ్రత్తలు సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ ( Coronavirus ) ఏపీ ( AP ) లో దాదాపు నియంత్రణలో ఉందనగా..యూకే కరోనా స్ట్రెయిన్ ( Uk Coronavirus strain ) కలవరం కల్గిస్తోంది. యూకే నుంచి ఇండియాకు రిటర్న్ అయినవారిలో ఏపీకు వచ్చినవారిని గుర్తించి..పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకుని కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించడం, కంటైన్మెంట్ వ్యూహాల్ని సిద్ధం చేయడం అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 


సంక్రాంతి ( Sankranthi ) నేపధ్యంలో పెద్దఎత్తున జనం గుమిగూడకుండా చూడటం, భారీ జన సమూహాలు లేకుండా నియంత్రించడం చేయాలని కోరింది. ప్రస్తుతం ఉన్న 1519 నమూనా సేకరణ కేంద్రాల్ని వికేంద్రీకరించనున్నారు. కరోనో టోల్ ఫ్రీ నెంబర్ 104ను కొనసాగించడం, కంటైన్మెంట్ జోన్ల నోటిఫై, ఫీవర్ క్లినిక్‌ల ఏర్పాటు చేయాలని పేర్కొంది. 


కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. కోవిడ్ కారణంగా చనిపోయినవారి అంత్యక్రియల కోసం 15 వేల ఆర్ధిక సహాయం అందించాలంది. రాష్ట్రంలోని ప్రతి ఆసుపత్రికి నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. ప్రభుత్వ , ప్రైవేటు ఆసుపత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ( Ysr Aarogyasri ) కింద ఉచిత చికిత్స అందేలా చూాడాలని స్పష్టం చేసింది. 


Also read: AP: ప్రభుత్వమే లే అవుట్లు అభివృద్ధి చేసిచ్చేలా కీలక నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook