AP 10th Class Exams:కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. హైకోర్టు సూచనల్ని పరిగణలో తీసుకుని ఇప్పటికే ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసిన ప్రభుత్వం..త్వరలో పదవ తరగతి పరీక్షలపై పునరాలోచించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) ఉధృతి పెరుగుతున్నట్టే ఏపీలో సైతం రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. కొన్ని నిర్ణయాల్ని మార్చుకుంటోంది. కరోనా కట్టడి కోసం మే 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ వేళల్ని మార్చింది. ఇకపై పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనుంది. మే 5 నుంచి మద్యాహ్నం 12 గంటల్నించి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ పూర్తిగా కర్ఫ్యూ ఉంటుంది. అంటే ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 12 గంటల వరకే షాపులు తెరిచుంటాయి. మరోవైపు మే 5 నుంచి ప్రారంభం కావల్సిన ఇంటర్ పరీక్షల్ని(Inter Exams postponed) వాయిదా వేసింది. హైకోర్టు సూచనలు, పిటీషనర్లు అభిప్రాయాల్ని పరిగణలో తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అడ్వకేట్ జనరల్  శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. తదుపరి పరీక్షల్ని ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్మయించలేదని..పరిస్థితుల్ని బట్టి తేదీ నిర్ణయిస్తామని ప్రభుత్వం ( Ap government) వెల్లడించింది.


ఇక పదవ తరగతి పరీక్షల నిర్వహణ ( Ap Tenth Exams) పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టు( Ap High Court) కు తెలిపింది ప్రభుత్వం. వచ్చే మూడు వారాల్లో పరిస్థితుల్ని బట్టి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోనందున కేసు విచారణను జూన్ 2 వ తేదీకు వాయిదా వేసింది.


Also read: AP Curfew: ఏపీలో కఠిన ఆంక్షలు, మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo