ఏపీలో ఇక నుంచి పెళ్లిళ్లలో 150 మంది వరకూ అనుమతి
AP Government: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో క్రమక్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. పెళ్లిళ్లు వంటి సామూహిక కార్యక్రమాలకు అనుమతి పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP Government: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో క్రమక్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. పెళ్లిళ్లు వంటి సామూహిక కార్యక్రమాలకు అనుమతి పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) నేపధ్యంలో లాక్‌డౌన్ ముగిసిన తరువాత పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలపై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ కేవలం 20 మందికి మాత్రమే గరిష్ట అనుమతి ఉంది. అది కూడా తహశిల్దార్‌తో అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో ఆంక్షల్ని సడలిస్తోంది ఏపీ ప్రభుత్వం(Ap government). కోవిడ్ నియంత్రణలో భాగంగా పూర్తిగా ఆంక్షల్ని సడలించకుండా అనుమతి పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇక నుంచి ఏపీలో పెళ్లిళ్లతో పాటు ఏ ఫంక్షన్లు, ప్రార్ధనలైనా సరే గరిష్టంగా 150 మంది మించకూడదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కోవిడ్ నిబంధనలు(Covid19 Guidelines)కఠినంగా పాటించాలని, మాస్కులు ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఇటు సినిమా హాళ్లలో మాత్రం 50 శాతం అనుమతిచ్చారు. తాజా నిబంధనలు పక్కాగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలు తగిన ప్రణాళిక రూపొందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
Also read: ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు..ఇంటి వద్దకే గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook