Ysr Awards: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న వైఎస్సార్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. కోవిడ్ గైడ్‌లైన్స్ నేపధ్యంలో కార్యక్రమం వాయిదా వేసినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం(Ap government)వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన సంస్థలకు, వ్యక్తులకు ప్రతి యేటా వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం, వైఎస్సార్ ఎఛీవ్‌మెంట్ అవార్డుల్ని ప్రదానం చేస్తోంది. ఈ యేడాది వైఎస్సార్ అవార్డుల్ని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 13వ తేదీన విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్‌లో జరగాల్సి ఉంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 11 మంది, లలిత కళలు, సాంస్కృతికరంగాల్లో 20 మంది, సాహిత్య విభాగంలో 7, జర్నలిజంలో 7, కోవిడ్ ఫ్రంట్‌లైన్ యోధులు 7, ఉత్తమ సేవలందించిన 8 సంస్థలకు అవార్డులు ప్రకటించారు. 


ఆగస్టు 13 న జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం వాయిదా వేసినట్టు ప్రకటించింది. అవార్డు గ్రహీతల్లో పెద్దవయస్సువారు ఉండటం,150కు మించి ప్రజలు హాజరుకాకూడదనే వైద్య ఆరోగ్యశాఖ నిబంధనల నేపథ్యంలో వైఎస్ఆర్ అవార్డుల(Ysr Awards)కార్యక్రమాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. అవార్డు గ్రహీతల ఆరోగ్యం, వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్ని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేశామని..తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. 


Also read: కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook