Ap Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల వివాదం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వైసీపీ ప్రకటించింది. పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తున్నట్టు వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల ( Ap Panchayat Elections ) వివాదం దాదాపు ముగిసినట్టే. పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna reddy ) స్పష్టం చేశారు. పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తుందని కూడా ఆయన వెల్లడించడంతో వివాదం దాదాపుగా ముగిసినట్టే అన్పిస్తోంది. ప్రభుత్వానికి ( Ap Government ) ఎలాంటి భేషజాల్లేవని..ప్రజారోగ్యం దృష్ట్యా మాత్రమే కోర్టుకు వెళ్లామని చెప్పారు. 


ఉద్యోగ సంఘాల ఆవేదనను ఎస్ఈసీ ( SEC Nimmagadda Ramesh kumar ) అర్ధం చేసుకోలేదని..ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాలన్న విషయాన్ని గమనించలేదని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదే సమస్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఉంటుందని చెప్పారు. మధ్యలో నిలిచిపోయిన ఎంపిటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని పక్కనబెట్టి..పంచాయితీ ఎన్నికల్ని తీసుకురావడంలోనే కుట్రకోణం దాగుందని సజ్జల విమర్శించారు. సుప్రీంకోర్టు ( Supreme court ) తీర్పు వెలువరించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా..ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాయడంపై మండిపడ్డారు. ప్రభుత్వంతో చర్చించాలన్న ఆలోచన ఇప్పటికీ ఎస్ఈసీకు లేదన్నారు. 


ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తమ పార్టీకు కొత్త కాదని, చంద్రబాబు ( Chandrababu )లా ఎన్నికలకు భయపడి వెనుకడుగు వేయమన్నారు. ఎస్ఈసీ కేంద్రానికి లేఖ రాయడమనేది అర్ధం లేని చర్యగా అభివర్ణించారు. సిబ్బందికి ఏమైనా జరిగితే ఎస్ఈసీదే పూర్తి బాధ్యతని చెప్పారు. 


Also read: Ap Panchayat Elections 2021 Reschedule: పంచాయితీ ఎన్నికల్ని రీ షెడ్యూల్ చేసిన ఎన్నికల సంఘం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook