AP Exams Schedule: ఏపీలో 2023 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే
AP Exams Schedule: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ముందస్తు షెడ్యూల్ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు అలర్ట్ . రాష్ట్ర ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి సెక్రటరీ నజీర్ అహ్మద్ విడుదల చేశారు.
ఏపీ ఈపీసెట్ సహా వివిధ ప్రవేశ పరీక్షలు ఎప్పుడెప్పుడు జరుగుతాయనేది ముందుగానే ప్రకటితమైంది. జూన్ వరకూ వివిధ సందర్భాల్లో జరిగే వివిధ ప్రవేశ పరీక్షల తేదీని ముందుగా ప్రకటించడం వల్ల విద్యార్ధుల ప్రిపరేషన్ సులభమౌతుంది. ఏపీ ఈపీసెట్ 2023 పరీక్షను మే 15 నుంచి 25 వరకూ నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారానే రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల్లోని వివిధ కోర్సుల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలుంటాయి. రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానుండగా, మార్చ్ 15 నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
ప్రవేశ పరీక్షల పూర్తి షెడ్యూల్
ఏపీ ఈసెట్ 2023 పరీక్ష మే 5
ఏపీ ఈఏపీసెట్ 2023 స్ట్రీమ్ పరీక్ష మే 15 నుంచి 22 వరకూ
ఏపీ ఈఏపీసెట్ 2023 బైపీసీ స్ట్రీమ్ పరీక్ష మే 23 నుంచి 25 వరకూ
ఏపీ ఐసెట్ 2023 పరీక్ష మే 25 నుంచి 26 వరకూ
ఏపీ పీజీఈసెట్ 2023 పరీక్ష మే 28 నుంచి 30 వరకూ
ఏపీ లాసెట్ 2023 పరీక్ష మే 20వ తేదీన
ఏపీ ఎడ్‌సెట్ 2023 పరీక్ష మే 20న
ఏపీ పీజీసెట్ 2023 పరీక్ష జూన్ 6 నుంచి 10 వరకూ
ఏపీ ఆర్‌సెట్ పరీక్ష జూన్ 12 నుంచి 14 వరకూ
Also read: AP High Court: జీవో నెంబర్ 1పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook