AP DSC New Schedule 2024: ఏపీ డీఎస్సీ పరీక్షల తేదీలు మారాయి. మార్చ్ 15 నుంచి ప్రారంభం కావల్సిన పరీక్షలు మార్చ్ 30 నుంచి జరగనున్నాయి. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ మార్చింది. మార్చ్ 20 నుంచి పరీక్ష కేంద్రాలను ఎంచుకోవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ డీఎస్సీ పరీక్షకు సన్నద్ధమౌతున్న విద్యార్ధులకు ముఖ్య గమనిక. పరీక్ష తేదీలు మారాయి. టెట్ , డీఎస్సీకు మధ్య కనీసం 4 వారాల గడువు ఉండాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ మారింది. మార్చ్ 15 నుంచి ప్రారంభం కావల్సిన పరీక్షలు మార్చ్ 30 నుంచి మొదలు కానున్నాయి. మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రెండు విడతలుగా ఎస్జీటీ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 7వ తేదీన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు ఇంగ్లీషు భాషా ప్రావీణ్య పరీక్ష ఉంటుంది. మార్చ్ 20 తేదీ నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలకు పరీక్షా కేంద్రాల ఎంపిక చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్ ప్రక్రియ ఆ రోజు ప్రారంభం కానుంది. 


ఇక ఈ నెల మార్చ్ 25 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 7 వ తేదీన టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టుల ప్రాధమిక పరీక్ష ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. ఏప్రిల్ 13 నుంచి 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలుంటాయి. 


Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ పోటీ చేసే లోక్‌సభ స్థానాలివే, ఎవరెక్కడి నుంచంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook