Anajli on Game Changer:‘గేమ్ చేంజర్’ లో నా కెరీర్ లోనే బెస్ట్ చిత్రం అవుతుంది.. అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Anajli on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమాలో ఓ కథానాయికగా నటించిన అంజలి.. ‘గేమ్ చేంజర్’ మూవీ ఈ నెల 10 గ్రాండ్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అంజలి.

1 /9

సంక్రాంతికి మీ రెండు సినిమాలు రాబోతున్నాయి..? దాని గురించి చెప్పండి? ఏ యాక్టర్‌కి అయినా సరే సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. తెలుగులో గేమ్ చేంజర్, తమిళంలో విశాల్ సినిమా రాబోతోంది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను.

2 /9

గేమ్ చేంజర్‌లో మీ పాత్ర గురించి చెప్పండి? గేమ్ చేంజర్‌లో నా  క్యారెక్టర్ పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ స్టోరీ చెప్పినప్పుడు.. పాత్ర పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెబుదామని అప్పటి నుంచీ వెయిట్ చేస్తూనే వచ్చాను. ఈ కారెక్టర్ నా నుంచి చాలా డిమాండ్ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. శంకర్  నా నటన చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం, కారెక్టర్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

3 /9

మీ పాత్ర కోసం మీరు చేసుకున్న ప్రిపరేషన్స్ ఏంటి? పార్వతి పాత్ర కోసం నేనేమీ ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదు. నా పాత్రలో సస్పెన్స్, ట్విస్ట్ ఉంటుందని శంకర్ ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇంకా నేను ఆ పాత్ర గురించి ఎక్కువగా చెప్పకూడదు. అది థియేటర్‌లో ఆడియెన్స్ చూసినప్పుడు చాలా కొత్తగా  ఉంటుంది.

4 /9

మీ పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందని అంతా అంటున్నారు? నేను కూడా స్టోరీ విన్నప్పుడు అలానే అనుకున్నాను. నాక్కూడా అలానే అనిపించింది. అంతా అంటున్నట్టుగా అదే నిజమైతే అంతకంటే గొప్ప విషయం, సక్సెస్ ఇంకేం ఉంటుంది.   ఈ పాత్రను పోషించడంలో మీకు ఎదురైన సవాళ్లు ఏంటి? బయటే జరిగే సంఘటనలు, ఎదురైన అనుభవాల నుంచే ఏ యాక్టర్ అయినా కూడా తెరపై నటించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ సినిమాలోని కారెక్టర్‌, ఆ బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఇలాంటి ఘటనలు, మనుషులు ఎప్పుడూ ఎదురు కాలేదు.

5 /9

అప్పన్న పాత్రతో మీ జర్నీ ఎలా ఉండబోతోంది? శంకర్  నా పాత్ర గురించి చాలానే చెప్పారు. నా పాత్రలో కొత్తగా ఉంటుంది.  ఎనా పాత్రను తెరపై చూసినప్పుడు ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవుతారు. అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అవుతుంది.

6 /9

రామ్ చరణ్‌తో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది? రామ్ చరణ్ గారు తన కో స్టార్స్‌కు కంఫ్టర్ట్ ఇస్తారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ చాలా కామ్‌గా ఉంటారు. సెట్స్‌లో అందరితోనూ బాగా ఉంటారు. అందరితోనూ చక్కగా మాట్లాడతారు. దిల్ రాజు  బ్యానర్, శంకర్ చిత్రం, రామ్ చరణ్ తో ఫస్ట్  సినిమా కావడంతో నాకు ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రత్యేకం అని చెప్పాలి.  శంకర్, మణిరత్నం చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. నాకు శంకర్  చిత్రంలో ఛాన్స్ రావడం హ్యాపీగా ఉంది.

7 /9

గేమ్ చేంజర్ మీ లైఫ్‌కు గేమ్ చేంజర్ అవుతుందా? గేమ్ చేంజర్ వల్ల నా ఆలోచనాధోరణి మారింది. ఈ ప్రయాణంలో ఎంతో మార్చుకున్నాను.ఈ విషయంలో నాకు గేమ్ చేంజర్ నిజంగానే గేమ్ చేంజర్ అని చెప్పాలి. చిరంజీవి  సినిమా చూసి నా పాత్రను మెచ్చుకున్నారని తెలిసింది. అదే నాకు పెద్ద అవార్డు.

8 /9

రామ్ చరణ్ గారితో మీరు చేసిన సాంగ్ గురించి చెప్పండి? ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అరుగు మీద అంటూ ఓ పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ పాట రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. నాకే కాకుండా టీం అందరికీ కూడా అది ఫేవరేట్ సాంగ్. అది ఎప్పటికీ నిలిచిపోయే పాట.

9 /9

దిల్ రాజు  నిర్మాణంలో మళ్లీ నటిస్తుండటం ఎలా ఉంది? దిల్ రాజు గారి నిర్మాణంలో నాకు ఎప్పుడూ గొప్ప చిత్రాలే వచ్చాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్ట, వకీల్ సాబ్  అన్నీ మంచి చిత్రాలే వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతోంది. ఇది కూడా చాలా మంచి చిత్రం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నాకు హోం బ్యానర్ లాంటిది.