Antarvedi temple issue: రధం దగ్దంపై ప్రభుత్వం సీరియస్..ఈవో సస్పెన్షన్
అంతర్వేది ఆలయ రధం దగ్దమైన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.
అంతర్వేది ఆలయ ( Antarvedi temple issue ) రధం దగ్దమైన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేదిలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ( lakshmi narasimha swamy temple ) చాలా విశిష్టత ఉంది. రాష్ట్రంలోని ప్రముఖమైన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయం రధం హఠాత్తుగా దగ్దమవడం సంచలనం రేపడమే కాకుండా...వివాదాస్పదమై హాట్ టాపిక్ మారింది. ప్రతిపక్షం అదే పనిగా విమర్శలు చేస్తోంది ఈ ఘటనపై. ఇదే ఘటనకు సంబంధించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ( Ap Government ) ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఆలయం ఈవో చక్రధర్ రావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఈవోను నియమించేవరకూ అన్నవరం ఆలయం ఈవో అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో ఓ షెడ్డులో ఉన్న 62 ఏళ్ల చరిత్ర కలిగిన రధం దగ్దమవడం పలు సందేహాలకు దారి తీస్తోంది. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా విద్రోహ చర్య ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. Also read: AP: అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు తెరిచేందుకు సన్నాహాలు