AP Caste Census: దేశంలో బీహార్ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా కులగణన చేపట్టింది. ఆ తరువాత ఏపీలో ఇవాళ్టి నుంచి మొదలౌతోంది. తొలుత ప్రయోగాత్మకంగా కులగణన జరపనున్నాయి. అనంతరం పూర్తి స్థాయిలో చేపడతారు. రాష్ట్రంలో కులగణనకు సంబంధించిన ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో కులగణన చేపడుతోంది. మొత్తం రెండ్రోజులపాటు ఐదు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ కులగణన జరగనుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణసలో కులగణన జరగనుండటంతో ప్రాథాన్యత సంతరించుకుంది. ఏ సామాజికవర్గం ఎంత ఉందనేది తేల్చాలనే డిమాండ్ నేపధ్యంలో కులగణన ప్రారంభించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివిధ కుల సంఘాల నేతలు సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.


రెండ్రోజులపాటు అంటే ఇవాళ, రేపు ప్రయోగాత్మక దశలో కులగణన ప్రక్రియ ముగిసిన తరువాత పూర్తి స్థాయిలో ఈ నెల 27 నుంచి డిసెంబర్ 10 వరకూ కులగణన జరగనుంది. కుల గణన సర్వే నిమిత్తం వివిధ జిల్లాల్లో అధికారుల నిమాయకం పూర్తయింది. కుల గణన కార్యక్రమానికి తహశీల్దార్లు  నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. కుల గణన కార్యక్రమం గురించి ప్రతి ఇంటికీ వాలంటీర్ ద్వారా సమాచారం అందిస్తారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కులాల లెక్కలు సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. 


ఈలోగా అంటే నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రంలోని 5 సచివాలయాల పరిధిలో పైలట్ సర్వే ఉంటుంది. ఈనెల 16వ తేదీన జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు శిక్షణ ఇస్తారు. ఈ నెల 17వ తేదీన మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు ట్రైనింగ్ ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు కులగణనపై అవగాహన కల్పిస్తారు. మరోవైపు ఈ నెల 16 నుంచి 25 వరకూ ప్రతి వాలంటీర్ ఇంటింటికీ వెళ్లి కులగణనపై సమాచారం అందిస్తారు. 


మొత్తానికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా కుల వివరాలు సేకరిస్తారు. సర్వే కోసం వాలంటీర్లను ఉపయోగించరు. కేవలం ప్రజలకు కులగణన గురించి సమాచారం చేరవేసేందుకే వాలంటీర్ సేవలు తీసుకుంటారు. 


Also read: TDP-JSP Manifesto: ముగిసిన తొలిదశ టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో బేటీ, 11 అంశాలకు గ్రీన్ సిగ్నల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook