AP Cabinet Meet 2024: ఏపీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త వరాలిచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. ఇవాళ జరిగే కేబినెట్ బేటీ అత్యంత కీలకం కానుంది. ఎన్నికల వేళ జరుగుతున్న మంత్రివర్గ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్ధుల్ని సమూలంగా మార్చేస్తున్నారు. మరోవైపు సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు ప్రారంభించారు. అదే సమయంలో ఎన్నికల వేళ వరాలిచ్చేందుకు సిద్ధమౌతున్నారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. 2019లో అధికారంలో వచ్చినప్పట్నించి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్ జగన్ అదే మరోసారి అధికారాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ అందుకు కీలకం కానుంది. 


ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేసే అవకాశముంది. ఇప్పటికే ఈ అంశంపై ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు నివేదిక ఇచ్చారు. ఆర్ధిక భారం, నిర్వహణలో ఎదురౌతున్న కష్టాలపై నివేదికలో వివరాలున్నాయి. ఇక నిరుద్యోగులకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేబినెట్‌లో ఆమోదించనున్నారు. మరోవైపు డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించవచ్చు. 


ఇక మెగా హౌసింగ్ స్కీంలో భాగంగా జగనన్న కాలనీల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు కానుంది. ఇది కాకుండా రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకూ ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగవచ్చు. వీటిపై కూడా ఇవాళ జరిగే కేబినెట్‌లో నిర్ణయం వెలువడనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తరువాత ముఖ్యమంత్రి జగన్ సహా అంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 


Also read: Indian Railways Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు, 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook