విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఇప్పుడు ప్రీ ప్రైమరీ విద్యపై ఫోకస్ చేస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్ని అభివృద్ధి చేసి..వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


2019లో అధికారంలో వస్తూనే నాడు నేడు అనే వినూత్న కార్యక్రమం ద్వారా స్కూల్స్, కాలేజిల అభివృద్దిపై ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ కేంద్రాల్ని 4 వేల కోట్లతో నాడు నేడు ( Naadu-nedu ) కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఏపీలో అంగన్ వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ( Ysr pre primary schools ) గా మారనున్నాయి. ఈ మేరకు అదికార్లతో సమీక్షించారు. ప్రీ ప్రైమరీ కోసం ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారీ బాధ్యతను విద్యాశాఖకు అప్పగించారు. అంగన్ వాడీ ( Anganwadi ) లో పాఠ్య ప్రణాళిక అనేది ఒకటో తరగతి ప్రణాళికకు అనుబంధంగా ఉండాలన్నారు. ఇకపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంగన్ వాడీ టీచర్లకు డిప్లమో కోర్సు ఉంటుందన్నారు. ఈ మేరకు అంగన్ వాడీ టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని వైఎస్ జగన్ సూచించారు.


నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ ను ఎలా తీర్దిదిద్దుతున్నారో అలాగే అంగన్ వాడీ కేంద్రాల్ని అభివృద్ధి చేయాలన్నారు. ప్రాధమిక దశ నుంచే సంపూర్ణ మార్పులకు శ్రీకారం చుడుతున్నామని జగన్ ( Cm jagan ) చెప్పారు. Also read: Godavari Flood: గోదావరి మహోగ్ర రూపం..మూడో ప్రమాద హెచ్చరిక