Covid Care in Ap: అత్యధికంగా కరోనా పరీక్షలు, ఉచితంగా వైద్యం
Covid Care in Ap: దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు రాష్ట్రంలో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
Covid Care in Ap: దేశంలోనే అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు రాష్ట్రంలో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) శరవేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో మహమ్మారి నియంత్రణకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. దేశంలో అత్యధిక కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుు కృషి చేస్తోంది. చాలా రాష్ట్రాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు.ఈ పరిస్థితి ఏపీలో తలెత్తకుండా కరోనా బాధితులకు ఉచిత వైద్యం అందిస్తూ ముందంజలో నిలుస్తోంది. కరోనా కష్టకాలంలో ప్రజలు చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులకు గురి కావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవిడ్ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చారు. ప్రభుత్వ జాబితా ఉన్న అన్ని ఆస్పత్రులలో కోవిడ్ పేషెంట్లకు బెడ్లు ఏర్పాటు చేసి, ఉచిత వైద్యం అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు ఎంప్యానెల్ లేని ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కూడా పూర్తి స్థాయి కోవిడ్ చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం(Ap government). ప్రైవేటు ఆస్పత్రులో ప్రభుత్వం విధించిన రేట్లకు మాత్రమే కరోనా చికిత్స చేయాలని ఆదేశించింది. ఒకవేళ ప్రైవేటు ఆస్పతులు కరోనా పెషెంట్ల వద్ద అధిక మొత్తంలో ఫిజులు వసూలు చేస్తే చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశించింది. కరోనా విపత్తు సమయంలో చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసే అధికారం కూడా ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) తెలిపారు.
Also read: Viral Video: తిరుపతి రైల్వే స్టేషన్‌లో హీరోగా మారిపోయిన RPF కానిస్టేబుల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook