Work from Home Town: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రాచుర్యంలో వచ్చిన వర్క్ ఫ్రం హోం టౌన్ కాన్సెప్ట్ ప్రారంభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వర్క్ ఫ్రం హోం టౌన్. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం(Ap government) కొత్తగా ప్రవేశపెట్టిన కాన్సెప్ట్. ఐటీ రంగాన్ని విస్తరించేందుకు, ఐటీ యువతకు ఊతమిచ్చేందుకు డబ్ల్యూఎఫ్‌హెచ్‌టి ప్రారంభించింది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ఐటీ కంపెనీలు చాలామంది ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి విద్యుత్, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు లోపించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విధి లేక పట్టణ ప్రాంతాల్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పని చేయడం ప్రారంభించారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ప్రతి ఉద్యోగి కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే వర్క్ స్టేషన్‌కు చేరుకుని పనులు చేసేలా వర్క్ ఫ్రం హోం టౌన్స్ ఏర్పాటు చేస్తోంది. 


ఈ వర్క్ ఫ్రం హోం టౌన్ సెంటర్లలో(Work from home towns) అన్ని సౌకర్యాలు కల్పించి ఉద్యోగి నుంచి లేదా కంపెనీ నుంచి కొంతమొత్తం తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్, ఏపీ ఐటీ అసోసియేషన్, ఐటీ ఇన్నోవేషన్ సొసైటీ సంస్థల్ని గుర్తించే పని అప్పజెప్పింది. ముందుగా 20-25 ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేసి..స్పందనను బట్టి కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటికే విశాఖపట్నంలోని రుషికొండలో స్టార్టప్ విలేజ్, అనిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, దాడి ఇంజనీరింగ్ కళాశాలల్ని ఎంపిక చేసింది ప్రభుత్వం. ఒక్కొక్క వర్క్ ఫ్రం హోం సెంటర్లో కనీసం 50 మంది కూర్చుని పనిచేసేలా ఏర్పాట్లుంటాయి. చిన్న చిన్న ఊర్లలో ఉండే ఉద్యోగులు తక్కువ సమయంలో వర్క్ సెంటర్లకు చేరుకునేలా ఆయా ప్రాంతాల్లో వర్క్ సెంటర్లు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. 


Also read: ఏపీ ప్రభుత్వంపై పవన్ మండిపాటు.. వరద బాధితులకు సహాయంపై అసంతృప్తి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook