Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అర్ధంతరంగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ వ్యాక్సినేషన్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పుడు మరోసారి ఆ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో వ్యాక్సినేషన్ (Vaccination)కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరిగింది. పట్టణాల్లో మాత్రం ఎన్నికల ప్రక్రియ లేకపోవడంతో టీకా కార్యక్రమాన్ని ముమ్మరం చేయనున్నారు. నాలుగు వారాల వ్యవధిలో కోటిమందికి వ్యాక్సిన్ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంత త్వరగా పూర్తి చేయాలనేది ప్రణాళిక రచించారు. ఇక 45-60 ఏళ్ల ఉండి దీర్ఘ కాలిక రోగాలుంటే కూడా ఈ దశలో వ్యాక్సిన్ చేయించుకోవచ్చు. ఈ కేటగరీలో 6.31 లక్షలుండగా ఇప్పటికవరకూ 2.19 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక 60 ఏళ్లు పైబడినవారు 52.52 లక్షలుంటే.. ఇప్పటివరకూ 5.11 లక్షల మందే వ్యాక్సిన్ తీసుకున్నారు. 


మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు ముగియడంతో ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. మార్చ్ 31 తరువాత కొత్త ఎన్నికల కమీషనర్(Election commissioner)బాధ్యతలు స్వీకరించాక మిగిలిపోయిన జడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల(Zptc-Mptc Elections)ప్రక్రియను పూర్తి చేసి..గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది. 


Also read: YS Jagan: కర్నూలు ఎయిర్‌పోర్ట్ ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook